calender_icon.png 15 October, 2025 | 6:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

18న రాష్ట్ర బంద్‌కు ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు

15-10-2025 03:11:38 PM

ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చేకూరి గణేష్ మాదిగ

చిట్యాల,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని, బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 18న తలపెట్టిన రాష్ట్ర బంద్ కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చేకూరి గణేష్ మాదిగ తెలిపారు. రిజర్వేషన్లు సాధించేంతవరకు జరిగే ప్రతి పోరాటంలో పెద్ద ఎత్తున ఎస్సీ, ఎస్టీ, బీసీ లు  పార్టీలకతీతంగా పాల్గొని బంద్ ను విజయవంతం చేయాలని అన్నారు. బందులో పాల్గొనని ఏ ఒక్క నాయకుడి ని కూడా భవిష్యత్తులో జరిగే ఎన్నికలలో ఓటు వేయొద్దని అదేవిధంగా 42 శాతం రిజర్వేషన్స్ ఇవ్వకుండా ఎన్నికల జరిపించే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పార్టీలను చిత్తుగా ఓడించడానికి ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.