calender_icon.png 15 October, 2025 | 9:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వార్డు సమస్యలు పరిష్కరించాలని వినతి

15-10-2025 12:00:00 AM

ఇల్లందు టౌన్, అక్టోబర్ 14 (విజయక్రాంతి)ః ఇల్లందు పట్టణంలోని స్థానిక 5వ వార్డులో ఉన్న సమస్యలను పరిష్కరించాలని మంగళ వారం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ కు 5వ వార్డు మాజీ కౌన్సిలర్ ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. మున్సిపల్ కౌన్సిల్ పూర్తయి రెండు సంవత్సరాలు గడిచినప్పటినుండి 5వ వార్డు సమస్యల వలయంగా మారిందని ప్రధానంగా బర్లపెంట పాఠశాల నుండి పుల్లన్న స్తూపం వరకు రూ.11 లక్షల మంజూరైన ఇప్పటివరకు పనులు ప్రారం భించలేదన్నారు.

5వ వార్డులో మూడు బోర్లు ఉన్నా సరైన ఫ్లాట్ఫామ్ లేకపోవడంతో గత కౌన్సిల్ లో రూ.లక్ష మజురైన ఇప్పటి వరకు పనులు మొదలుపెట్టలేదన్నారు. గత మూడు నెలలుగా వీధి దీపాలు లేక వార్డు మొత్తం చీకటిమయం అవుతుందని, బుగ్గవాగు రింగుల వద్ద  పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయాలని, శానిటేషన్ అధ్వానంగా ఉందని, ప్రధానంగా కుక్కలు కోతులు బెడద తీవ్రంగా ఉందని అన్నారు. ఇవి మా వ్యక్తిగత అవసరాలు కావని 5వ వార్డు ప్రజల సమస్యలను దృష్టిలో పెట్టుకొని తక్షణమే పరిష్కరించాలని కోరారు.