15-10-2025 03:02:41 PM
వలిగొండ,(విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై హైకోర్టు ఇచ్చిన స్టేను రద్దు చేయాలని సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో వలిగొండ రాస్తారోకో నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి సలిగంజి వీరస్వామి మాట్లాడుతూ బిసి బిల్లులను ఆమోదించి, రిజర్వేషన్లను అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైన ఉందని అన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అమలు జీవోతో పాటు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మీద హైకోర్టు స్టే విధించడంతో, రిజర్వేషన్ల అమలు, స్థానిక సంస్థల ఎన్నికలు నిలిచిపోయాయని అన్నారు. ఈనెల 18న *బందు ఫర్ జస్టిస్ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన బంధు పిలుపులో సిపిఐ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయిని యాదగిరి, శీలం స్వామి, ఎలగందుల అంజయ్య, ఎల్లంకి మహేష్, సల్వాది రవీందర్ పాల్గొన్నారు.