15-10-2025 03:15:11 PM
తాగునీటిని అందుబాటులో ఉంచండి
ప్రతి కార్యకర్త ప్రజలకు అందుబాటులో ఉండాలి
ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): మిషన్ భగీరథ పైప్ లైన్లు పగిలిపోవడం చేత మహబూబ్ నగర్ నగరంలో గత వారం రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరాలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం అందరికీ వితమే అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ విషయాన్ని ప్రజలకు అవగతం అయ్యేలా చేస్తూ ప్రతి కార్యకర్త అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి అవసరమైన నీటిని ప్రత్యేక ట్యాంకర్ల ద్వారా అందుబాటులో ఉంచాలని సూచించారు.
ఆద నగరంలోని 49 వార్డుతో పాటు పలు ప్రాంతాలలో నీటి సరఫరా దాని విషయాన్ని ప్రజలకు పూర్తిస్థాయిలో తెలుపాలన్నారు. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటూ, నీటి కొరత తీర్చేందుకు సహకరించాలని సూచించారు. నగరంలో ఎక్కడైనా బోర్లు రిపేరు ఉన్న వెంటనే వాటిని రిపేరు చేయించాలని నాయకులకు, కార్యకర్తలను ఆదేశించారు. నగర పరిధిలో ఉన్న ప్రజలకు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవసరమైన మేరకు నీటి సరఫరాను చేయాలని ఆయన అధికారులకు ప్రత్యేకంగా తెలిపారు.