6 May, 2026 | 9:20 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

చిన్నారులు, వృద్ధులు జాగ్రత్త

02-09-2024 04:00 AM

బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ 

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): రాష్ట్రంలో భారీ వానలు కురిసి వరదలు వస్తుండడంతో ప్రజ లు తప్పనిసరి అయితే తప్ప బయటకు ఎవరూ రావద్దని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ఆదివారం ఎక్స్ వేదికగా స్పందిస్తూ వర్షాల నేపథ్యంలో చిన్నారుల, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలన్నారు. తాత్కాలిక నిర్మా ణాలు, పాత భవనాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలని, వరదప్రభావిత ప్రజలకు సహా యం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ముగ్గురు మంత్రులు ఉన్నా .. 

రాష్ట్ర వ్యాప్తంగా వరదల పరిస్థితిని అదుపు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. ఖమ్మంలో పరిస్థితి మరింత దారుణంగా ఉందని, ముగ్గురు మంత్రులు ఉన్నా ప్రజలకు ఏమా త్రం ఉపయోగం లేని పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో విసిగిపోయిన ప్రజలు ఖమ్మంలోని త్రీ టౌన్ ప్రాంతంలో వీధుల్లో నిరసన చేపట్టారని గుర్తు చేశారు. కనీస సాయం కోసం వరదల సమయంలో ప్రజలు ఆందోళన చేయడం అంటే ప్రభు త్వం ఎంత ఉదాసీనత వైఖరితో ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు.