1 July, 2026 | 12:32 PM

బాధితులకు 25 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి

02-09-2024 04:00 AM

మాజీ మంత్రి హరీశ్‌రావు 

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాం తి): భారీ వర్షాలకు ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు.  గాయపడ్డ వారికి రూ. 5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరా రు. తాత్కాలిక రిలీఫ్ కోసం తక్షణ ఆర్థిక సా యం ప్రకటించాలన్నారు.  వర్షాలకు ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం బాధకరమన్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఒకరి కొకరు బాసటగా నిలిచి భరోసా ఇవ్వాలని సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు విశ్వాసం కలిగించేలా యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయడంతో పాటు పరిస్థితులను ఎప్పటికప్పుడు మానిటర్ చేసి, ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు ప్రజలకు అందుబాటులో ఉండి సహా యక చర్యలు చేపట్టాలని సూచించారు. కష్ట కాలంలో ప్రజలకు తోడుగా నిలవాలని పిలుపునిచ్చారు.

బాధితులకు సహాయం అందించాలె

ప్రభుత్వం వెంటనే స్పందించి  అత్యవసర సేవలు అందించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు సూచించారు. ఆదివారం నల్లగొండ జిల్లా దేవరకొండలో మాట్లాడారు. అవసరమైతే సైన్యం సహాయం తీసుకోవాలని, ప్రత్యేక హెలికాప్టర్లు తెప్పించాలని కోరారు. చెరువులు, కాలువలు తెగకుండా ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. అధికారులకు సెలవులు రద్దు చేసి 24 గంట లు అప్రమత్తంగా ఉండేలా ప్రభుత్వం చర్య లు తీసుకోవాలన్నారు. పోలీసు లు ప్రత్యేక బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలను  కాపాడాలని ఆయన సూచించారు.