calender_icon.png 29 January, 2026 | 1:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నారులు భద్రంగా..

23-01-2025 12:00:00 AM

చలికాలం జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఈ కాలంలో వైరస్, బ్యాక్టీరియా సులభంగా వ్యాప్తి చెందుతాయి. ముఖ్యంగా చిన్న పిల్లలు తరచూ అనేక అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు. ఈ నేపథ్యంలో పిల్లల ఆరోగ్యంపై తల్లిదండ్రులు కచ్చితంగా ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అవేంటో తెలుసా..

పిల్లలకు క్రమంతప్పకుండా వ్యాక్సి న్స్ వేయించాలి. ఎందుకంటే చలికాలంలో వివిధ రకాలు వ్యాధులు, వైరస్‌లు ఎటాక్ చేస్తుంటాయి. వ్యాక్సీన్స్‌తో కొన్ని సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే పిల్లలు ఉండే ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. దీనివల్ల ఇన్‌ఫెక్షన్లు ఉండవు.

జలు బు, దగ్గు వంటి సమస్యలు వస్తే.. వెంట నే అలెర్ట్ అవ్వాలి. వైద్యుల సహాయం త్వరగా తీసుకుంటే మంచిది. లేదంటే జలుబుతో ముక్కుపట్టేసి ఇబ్బంది పడొచ్చు. ఇన్‌ప్లూయెంజా వ్యాక్సీన్‌తో దగ్గు, జలుబు, జ్వరం లాంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. వీటిని ఏడాది పిల్లలకు రెండుసార్లు వేస్తారు. ఆ తరువాత ఐదేళ్ల వరకు ప్రతి సంవత్సరం ఒక్కొక్కటి చొప్పున తీసుకోవాలి. సీజనల్ టీకాలు కూడా వేయించాలి.

మాయిశ్చరైజర్ 

పిల్లల చర్మం చాలా సున్నితంగా ఉంటుం ది. చలికాలంలో చర్మం బాగా డ్రై అవుతుంది. అందుకే వారికి రెగ్యులర్‌గా మాయి శ్చరైజర్ అప్లయ్ చేయాలి. లేదంటే డ్రై స్కిన్ చర్మంపై దురద లాంటివి బాధిస్తాయి. కాబట్టి బేబీ ఫ్రెండ్లీ సన్‌స్క్రీన్స్ రాయొచ్చు. వీటివల్ల స్కిన్ కూడా హెల్తీగా ఉంటుంది. 

మంచి నిద్ర

పిల్లలకు ఎప్పుడు మంచి నిద్ర ఉండేలా చూసుకోండి. అలాగే వారు బాడీ టెంపరేచర్ తగ్గట్టుగా రూమ్ టెంపరేచర్ ఉండేలా చూసుకుంటే మంచిది. మంచి పరుపు కూడా మంచి నిద్ర అందిస్తుంది. వారికి ఇతర ఇబ్బందులు రాకుండా చేస్తుంది. చలి ఎక్కువగా ఉందని బాగా వేడి చేసిన ఆహార పదార్థాలు, నీళ్లు ఇవ్వకూడదు. 

వేడి వేడిగా

చలికాలంలో పిల్లలకు ఎక్కువ ఫ్లూయిడ్స్ అందించాలి. గోరువెచ్చని లేదా నార్మల్ నీటిని వారికి అందించాలి. అలాగే పాలు లేదా బ్రెస్ట్ ఫీడ్ ఇవ్వాలి. చల్లని పదార్థాలు, చల్లని ఆహారాలు అందించకపోవడమే మంచిది. 

కలిగే ఇబ్బందులు.. 

చలి వల్ల పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. హైపోథెర్మియా, డీహైడ్రేషన్, స్కిన్ సమస్యలు ఎక్కువగా వస్తాయి. జలుబు, దగ్గు, జ్వరం కూడా వస్తుంటాయి. కాబట్టి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

రాత్రి పూట వారికి తేలిగ్గా ఉండే దుప్పట్లను కప్పాలి. ముఖ్యంగా, రాత్రి పూట పిల్లల గది వెచ్చగా ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ల గదిలో ఉష్ణోగ్రత 16- డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటే చాలు. ఉష్ణోగ్రత ఎక్కువైతే అది పిల్లల ప్రాణానికే ముప్పుగా మారవచ్చు.

పిల్లలను బయటకు తీసుకెళ్లేటప్పుడు వారి తల వెచ్చగా ఉండేలా చూడాలి. వాళ్ల శరీరంలో నుంచి వేడి బయటకు పోకుండా చేతులకు గ్లవ్స్ తొడగాలి.

కారులో ప్రయాణించేటప్పుడు మందంగా ఉండే ఉన్ని దుస్తులు, కోటు వేయాలి.

అవసరమైతే, పిల్లల్ని కారులో సౌకర్యవంతంగా కూర్చోబెట్టిన తర్వాత, వారికి ఒక దుప్పటి కప్పాలి. కారులోకి వచ్చిన తర్వాత వారికి వేసిన అదనపు దుస్తులను తొలగించాలి.