calender_icon.png 17 November, 2025 | 11:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జాతరకు పంపలేదని బాలుడు ఆత్మహత్య

08-03-2025 06:00:33 PM

వెల్దండ,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లాలో దారుణం జరిగింది. ఎనిమిదేళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వెల్దండ మండలం, అల్లంతోటబావి తండాలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... వెల్దండ మండలం, అల్లంతోటబావి తండాలో ఓ బాలుడిని తల్లిదండ్రులు జాతరకు పంపలేదని మనస్థాపంతో బట్టలు ఆరేసే తాడు చుట్టుకొని ఉరివేసుకున్నాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బాలుడిని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. బాలుడి మృతితో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.