calender_icon.png 17 November, 2025 | 1:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన సీఎం

08-03-2025 06:24:26 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): కోఠిలో చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీలో అభివృద్ధి పనులకు, నూతన భవన నిర్మాణాలు, చారిత్రక కట్టడాల పునరుద్ధరణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అలాగే  కోఠిలోని ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో దర్బార్ హాల్ ను సందర్శించిన సీఎం రేవంత్ చాకలి ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎంతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఐలమ్మ వర్సిటీ విద్యార్థినులు అంతర్జాతీయ వర్సిటీలతో పోటీపడాలని తెలిపారు. మహిళాలకు అవకాశం వస్తే నిరూపించుకుంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం మహిళాల కోసం అనేక పథకాలు అమలు చేస్తోందని గుర్తు చేశారు. స్వయం సహాయక సంఘాల ద్వారా 1000 ఎలక్ట్రిక్ బస్సులు కొని ఆర్టీసీకి ఇస్తున్నామని, ప్రభుత్వానికి సోలార్ విద్యుత్ సరఫరా చేసే విధంగా మహిళా సంఘాలు ఒప్పందాలు చేసుకున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. ఆదానీ, అంబాలనీలతో మహిళలు పోటీ పడే విధంగా వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. మహిళలు రాణించాలంటే చదువు కోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.