calender_icon.png 25 October, 2025 | 2:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దలకు చిన్నారుల పాదపూజ

24-10-2025 01:01:03 AM

  1. విలువల పండుగగా మారిన ఆరోగ్య పాఠశాల

కలెక్టర్ రాజార్షి షా

ఆదిలాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాం తి): వయోవృద్ధులు సమాజానికి చేసిన సేవలు ఎన్నటికి మరువలేనివని, పిల్లలు వారి పట్ల ప్రేమ, గౌరవం పెంపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ రాజార్షి షా అన్నారు. గురువారం ఇచ్చోడ మండలం బోరిగాం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ‘ఆరోగ్య పాఠశాల’ కార్యక్రమంలో భాగం గా హెల్ప్ ఏజ్ ఇండియా సంస్థ, వయోవృద్ధుల సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రాండ్ పేరెంట్స్ డే పాదపూజ కార్యక్రమాన్ని కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వారి అమ్మమ్మ, తాతయ్యలకు పాదపూజ చేసి, వారి ఆశీర్వాదాలు తీసుకున్నారు. కార్యక్రమంలో విద్యార్థుల యోగా ప్రదర్శనలు అం దరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం  విద్యార్థులు, అధికారులు, వృద్ధులతో కలిసి కలెక్టర్ పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ... గ్రాండ్పేరెంట్స్ మన కుటుంబాల మూలస్థంభాలని, వారు సృష్టించిన విలువలే నేటి తరానికి మార్గదర్శనం అన్నారు.

వయస్సు పెరిగినా వారి అనుభవం, ఆలోచనలు ఎప్పటికీ సమాజానికి దారి చూపిస్తాయని, యువతరం పెద్దల స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. తరతరాల మధ్య బంధాన్ని బలోపేతం చేసే కార్యక్రమాలు సమాజంలో విలువల పరిరక్షణకు దోహదం చేస్తాయని కలెక్టర్ పేర్కొన్నారు. వయోవృద్ధులు అనుభవజ్ఞులు, వారి సూచనలు, సలహాలు యువత కు మార్గదర్శకమని చెప్పారు.

విద్యార్థులు పెద్దలను గౌరవించి, వారి జీవిత అనుభవాలను పాఠాలుగా తీసుకోవాలని సూచించా రు. అంతకుముందు పాఠశాలలో వయోవృద్ధుల సంక్షేమం, సేవలు, సమస్యల పరిష్కా రం పై హెల్ప్ ఏజ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్‌షాపులో కలెక్టర్ పాల్గొన్నారు. వృద్ధుల కోసం ప్రభుత్వం చేపడు తున్న సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వృద్ధుల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా సమాజం వ్యవహరించాల్సిన అవసరాన్ని కలెక్టర్ వివరించారు. 

ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా సంక్షేమ అధికారి మిల్కా, వయోవృద్దుల సమాఖ్య అధ్యక్షులు దేవిదాస్ దేశ్ పాండే, ఉపాధ్యక్షులు గంగాధర్, సెక్రెటరీ రాం కులకర్ణి, అధికారులు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.