calender_icon.png 26 October, 2025 | 12:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధర్మపురి ఆలయంలో ఘనంగా యమ ద్వితీయ వేడుకలు

24-10-2025 01:06:23 AM

జగిత్యాల అర్బన్, అక్టోబర్ 23(విజయ క్రాంతి) : యమ ద్వితీయ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మ పురి శ్రీలక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థాన అనుబంధ దేవాలయమైన శ్రీయమధ ర్మరాజు వారి దేవాలయం లో గురువారం విశేష పూజలు నిర్వహించారు. స్వామివారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం,ఆయుష్యసూక్తం తో అబిషేకం , ఆయుష్య హోమం, హరతి మంత్రపుష్పం కార్యక్రమంలు అత్యంత వైభవంగా నిర్వహించారు.

అనంతరం విశేష సం ఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు జక్కు రవీందర్, సభ్యులు ఎదులాపురం మ హేందర్ , బొల్లారం పోచయ్య, స్తంభం కాడి గణేష్, గుడ్ల రవీందర్, రాపర్తి సాయికిరణ్, వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ, పాలెపు ప్రవీణ్ కుమార్ శర్మ, సూపరింటెండెంట్ కిరణ్,సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్,అర్చకులు, భక్తులుపాల్గొన్నారు.