calender_icon.png 25 October, 2025 | 3:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలు పకడ్బందీగా నిర్వహించాలి

24-10-2025 12:58:37 AM

కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, అక్టోబర్ 23 (విజయక్రాంతి):వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు.  గురువా రం సాయంత్రం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సంబంధిత అధికారులు, కేంద్రాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు వరి ధాన్యం కొనుగోలుపై అవగాహన కల్పించా రు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వరి ధాన్యం కొనుగోలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కొనుగోలు కేంద్రా ల్లో రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నా రు. ప్రతి కొనుగోలు కేంద్రం వద్ద నిర్వాహకుల సమాచారం, టెంట్, త్రాగునీరు, తది తర సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. రైతులకు ధాన్యం కొనుగోలుకు సంబంధించి టోల్ ఫ్రీ నంబరు 9182958858ను ప్రదర్శించేలా ప్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు.

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో తప్పనిసరిగా ప్రోటోకాల్ పాటించా లని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్, పౌర సరఫరాల అధికారి రాజేందర్, మేనేజరు సుధాకర్, డిఆర్డివో విజయలక్ష్మి, వ్యవసాయ అధికారి అంజిప్రసాద్, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.