28-11-2025 09:40:37 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): రుద్రమదేవి వర్ధంతిని రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, శాసనమండలి ఉపసభాపతి బండా ప్రకాష్ కు తెలుగు అధ్యాపకులు టంగుటూరి సైదులు వినతిపత్రం అందజేశారు. దీనిపై ఉపసభాపతి హామీ ఇచ్చారు అని ఆయన తెలిపారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో రుద్రమదేవి వర్ధంతి సందర్భంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, సంగీత నాటక అకాడమీ, రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ సౌజన్యంతో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రుద్రమదేవి మరణ శాసనం, చారిత్రక విశేషాలు, కనుమరుగవుతున్న శాసన సంపద పరిరక్షణ అవసరం, అలాగే రుద్రమదేవి విగ్రహ ప్రతిష్టకు వివేకానంద యువజన మండలి చేసిన కృషిని వివరించారు. తరువాత నాటక అకాడమీ ఆధ్వర్యంలో రుద్రమదేవి నాటక ప్రదర్శన జరిగింది. అనంతరం టంగుటూరి సైదులను సన్మానించారు.