calender_icon.png 28 November, 2025 | 9:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నామినేషన్ ప్రక్రియలో రిటర్నింగ్ అధికారులు చురుకుగా పని చేయాలి

28-11-2025 09:44:31 PM

సూర్యాపేట కలెక్టర్ తేజస్ నందనల్ పవర్

తుంగతుర్తి,(విజయక్రాంతి): నామినేషన్ ప్రక్రియలో రిటర్నింగ్ అధికారులు  చురుకుగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందనాల పవర్ అన్నారు. శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గ్రామపంచాయతీ కార్యాలయాల్లో మొదటి విడత గ్రామ సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నిక నిమిత్తం అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. నామినేషన్ స్వీకరణ కేంద్రంలోనికి అభ్యర్థులతో పాటు మరో ఇద్దరిని మాత్రమే అనుమతించాలని అలాగే వాహనాలు 100 మీటర్ల దూరంలో ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు.

అభ్యర్థులకు నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి సందేహాలు ఉన్నా హెల్ప్ డేస్ ద్వారా నివృత్తి చేసుకోవాలని ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా అధికారులు విధులు నిర్వహించాలని అన్నారు. గ్రామాల వారీగా స్వీకరించిన నామినేషన్ పత్రాలను వేర్వేరుగా భద్రపరచాలని అన్నారు. అనంతరం మండల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీలో నామినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ఆయన వెంట ఎమ్మార్వో దయానందం, ఎంపీడీవో శేషు కుమార్ సీఐ నాగేశ్వరరావు, ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు