calender_icon.png 3 October, 2025 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రసాయన శాస్త్రంలో చీమలపాటి వీఏ శశికళకు పీహెచ్డీ

03-10-2025 07:27:43 PM

పటాన్ చెరు: హైదరాబాదులోని గీతం స్కూల్ ఆఫ్ సైన్స్, రసాయన శాస్త్ర విభాగం పరిశోధక విద్యార్థిని చీమలపాటి వీఏ శశికళ డాక్టరేట్ కు అర్హత సాధించారు. ‘SGLT2 నిరోధకం అయిన కెనాగ్లిప్లోజిన్, యాంటీ-ఆండ్రోజెన్ అయిన అబిరాటెరోన్ అసిటేట్, వాటి సంబంధిత పదార్థాల సమర్థవంతమైన సంశ్లేషణ’పై అధ్యయనం చేసి, సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించారు. ఈ పరిశోధనకు మార్గదర్శనం వహిస్తున్న గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ రసాయన శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ అన్నాప్రగడ రత్నమాల శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. 

ఈ పరిశోధనలు ఔషధ సంశ్లేషణలో స్థిరమైన, ఖచ్చితమైన, వినూత్న విధానాల పెరుగుతున్న ప్రాముఖ్యతను ప్రముఖంగా ప్రస్తావిస్తోందన్నారు. ఈ సిద్ధాంత వ్యాసం పీహెచ్.డీ. పట్టాకు అర్హత సాధించడం పట్ల గీతం హైదరాబాదు అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ డీ.ఎస్.రావు, గీతం రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ఆర్ వర్మ, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, రసాయన శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ గౌసియా బేగం, పలు ఇతర విభాగాధిపతులు, అధ్యాపకులు, సిబ్బంది తదితరులు డాక్టర్ వీఏ శశికళను అభినందించినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.