03-10-2025 07:23:34 PM
నిర్మల్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రూపు 1 ఫలితాలలో ఉత్తమ ప్రతిభా కనబరచి ఆసిఫాబాద్ డిప్యూటీ కలెక్టర్ గా నియమించబడిన నిర్మల్ కు చెందిన జి.జే. జోయల్ ను వారి నివాసంలో కలిసి ఎస్టీయుటీఎస్ నిర్మల్ జిల్లా శాఖ పక్షాన శుభాకాంక్షలు తెలియజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు జుట్టు గజేందర్ మాట్లాడుతూ, ఎక్కడ పనిచేసిన ఉపాధ్యాయుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు ఎస్. భూమన్న యాదవ ప్రధాన కార్యదర్శి జె. లక్ష్మణ్ తదితర సభ్యులు పాల్గొన్నారు.