21-11-2025 07:41:41 PM
మంచిర్యాల,(విజయక్రాంతి): సింగరేణి సంస్థలో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదల, రక్షణ, వైద్య సేవల మెరుగుదల వంటి అంశాలపై సింగరేణి సిఎండీతో ఈ నెల 22న డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ఉంటుందని శ్రీరాంపూర్ జిఎం మునిగంటి శ్రీనివాస్ తెలిపారు. సింగరేణి సంస్థ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరామ్ నాయక్ శనివారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు “డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం”లో పాల్గొని సింగరేణి వ్యాప్తంగా ఉన్న అన్ని ఏరియాల కార్మికులు, అధికారుల సమస్యలను తెలుసుకుంటారన్నారు. సింగరేణి సంస్థ ఉత్పత్తి, ఉత్పాదకత పెంపుదల, రక్షణ, వైద్య సేవల పెంపుదలకు నిర్మాణాత్మక సూచనలు, సలహాలు ఫోన్ ద్వారా పంచుకోవచ్చని, ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు 040-23311338 నెంబర్ కు కాల్ చేయాలని సూచించారు.