calender_icon.png 21 November, 2025 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక చేయూత

21-11-2025 07:38:42 PM

వెంకటాపూర్(రామప్ప),(విజయక్రాంతి): మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చెందిన కల్లెపు పైడి ఇటీవల మరణించగా, ఆయనతో చిన్నప్పటి నుండి చదువుకున్న బాల్యమిత్రులు తమ స్నేహబంధానికి దారంగా నిలిచే విధంగా ఆదర్శప్రాయమైన అడుగు వేశారు. శుక్రవారం నిర్వహించిన తొమ్మిదవ రోజు కార్యక్రమంలో భాగంగా, మృతుడి స్వగృహానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.10,000 ఆర్థిక సహాయం అందజేశారు. కష్టకాలంలో మిత్రులు ఇలా అండగా నిలవడం గ్రామస్థుల ప్రశంసలు పొందుతోంది. ఈ కార్యక్రమంలో స్నేహితులు పుల్యాల రమేష్, శంకర్, అశోక్, ప్రసాద్, కుమార్, శ్రీనివాస్, ప్రేమ, విజయ, సునీత, సునంద లు పాల్గొని సహాయం అందించారు.