calender_icon.png 21 November, 2025 | 8:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పార్టీలకు అతీతంగా మత్స్యకారుల హక్కులకై పోరాడాలి

21-11-2025 07:26:39 PM

మత్స్యకారుల దినోత్సవ వేడుకల్లో జిల్లా డైరెక్టర్ పోతరవేని క్రాంతి

పెద్దపల్లి,(విజయక్రాంతి): పార్టీలకు అతీతంగా మత్స్యకారుల హక్కులకై పోరాడాలని మత్స్యశాఖ జిల్లా డైరెక్టర్ పోతరవేని క్రాంతి అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రం లోని పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్బంగా మంథని మత్స్యశాఖ అధ్యక్షులు జిల్లా డైరెక్టర్ పోతరవేని క్రాంతి కుమార్ ముదిరాజ్ ని ఘనంగా శాలువాతో  ప్రగతి మత్స్యకార సేవ సమితి వ్యవస్థపాక అధ్యక్షులు ఉస్థం శ్రీనివాస్ ముదిరాజ్, ప్రణాలిక కమిటీ చైర్మన్ నూనె రాజేశం ముదిరాజ్, ప్రగతి మత్స్యకార సేవ సమితి సభ్యులు ఘనంగా సన్మానించారు. 

ఈ సందర్బంగా క్రాంతి కుమార్ మాట్లాడుతూ మత్స్య కారులను ప్రభుత్వం చిన్న చూపు చూడకుండా సకాలంలో ఉచిత చేప పిల్లల పంపిణీ జరిగేలా చేసి నూతన పథకాలను అందించి ఆర్ధికంగా ప్రోత్సహించాలని సూచించారు. అనంతరం ప్రపంచ మత్స్యకారులందరికి శుభాకాంక్షలు తెలుపుతూ పార్టీలకు అతీతంగా మత్స్యకారుల హక్కులకై ప్రతి ఒక్కరూ పోరాడాలని తెలిపారు.