21-11-2025 07:36:35 PM
వెంకటాపురం(నూగూరు),(విజయక్రాంతి): ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలోని బోదాపురం గ్రామం పంచాయతీ సీతారాంపురం గ్రామం లోని కాఫేడు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మారుమూల గ్రామ ప్రాంతంలో వరద బాధితులకు కాఫేడ్ స్వచ్ఛంద సంస్థ నిత్యవసర సరుకులు 60 కుటుంబాలకు 10 కేజీ బియ్యం,కేజీ పంచదార, నూనె కేజీ, దుప్పట్లు, పప్పు, చింతపండు, మసాలా, పసుపు, శనగలు, కారం, సబ్బులు, గోధుమ పిండి,బరకం, 3000 రూపాయల విలువ చేసే సామాగ్రిలు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాన్ బోస్కో రీజనల్ కోఆర్డినేటర్ ప్రణయ్ హాజరైనారు. కాఫేడ్ స్వచ్ఛంద సంస్థ చేసే సేవలను పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్న కాఫేడ్ స్వచ్ఛంద సంస్థను ఇక ఎన్నో సేవలు అందించాలని కోరడం జరిగింది. ఈ సమావేశంలో మాట్లాడుతూ... మారుమూల గిరిజన ప్రాంతంలో ప్రజలు వరద సమయంలో అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
కాఫేడ్ స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్ లూర్థు రాజు మాట్లాడుతూ మారుమూల గ్రామాల్లోని ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని గ్రామంలోనీ ఆచారం, సాంప్రదాయం మరిచి పోతున్నారని, మన ఆచారాలను కాపాడుకోవాలని తెలియజేసినారు. ఏజెన్సీ ఏరియాలో ఉపయోగపడే వివిధ పథకాలు, అభివృద్ధి పనులను చేయడం జరుగుతుందని కొనియాడినారు. అలాగే బడి మానేసిన పిల్లలను పాఠశాలలో చేర్పించే విధంగా చెయ్యాలని గ్రామస్తులకు తెలియజేసినారు.