06-09-2025 10:53:06 PM
కోదాడలో హోరా హోరీగా గణేష్ లడ్డూ వేలం పాట
కోదాడ: కోదాడ పట్టణంలో కాన్వాసింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. చివరి రోజు నిమజ్జనం సందర్భంగా శనివారం గణేష్ లడ్డూ వేలంపాటను హోరా హోరిగా వేలంపాట వేయగా గణేష్ లడ్డూను వేలంపాటలో శ్రీ లక్ష్మీ సాయి లారీ సప్లై ఆఫీస్ వారు చింతల వీరయ్య బృందం సభ్యులు రూ.3,51,557.00లకు పాటలో స్వామివారి లడ్డూను దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా చింతల వీరయ్యకు అసోసియేషన్ సభ్యులు శాలువాతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చింతల శ్రీను,వెంపటి పద్మ, మధుసూదన్, గట్ల కోటేశ్వరరావు, అసోసియేషన్ అధ్యక్షులు అర్వపల్లి హనుమంతరావు, ఉపాధ్యక్షులు చాప గోవిందరావు, ప్రధాన కార్యదర్శి గడ్డం రాంబాబు, సహాయ కార్యదర్శి ఓరుగంటి శ్రీనివాసరావు, కోశాధికారి సముద్రాల బద్రిష్, బొడ్ల నాగేశ్వరరావు, ఆగిర్ పర్వతాలు తదితరులు పాల్గొన్నారు.