calender_icon.png 7 September, 2025 | 4:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లాలో పార్టీ పటిష్టతకు పాటుపడాలి

06-09-2025 10:49:32 PM

పార్టీ శ్రేణులకు మంత్రి సీతక్క సూచన

ఆదిలాబాద్,(విజయక్రాంతి): జిల్లాలో పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని వార్దాలో గల సేవాగ్రామ్ సందర్శనకు వెళ్తూ శ‌నివారం ఆదిలాబాద్ కు విచ్చేసారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి, కాంగ్రెస్ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. మంత్రి పోలీసుల గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. అనంత‌రం కాసేపు జిల్లా రాజ‌కీయాలు, ప్ర‌భుత్వ సంక్షేమ ప‌థ‌కాలను ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్ల‌డం, స్థానిక ఎన్నిక‌లు త‌దిత‌ర విష‌యాల‌పై చ‌ర్చించారు. అనంతరం జీసీసీ చైర్మ‌న్ కొట్నాక తిరుప‌తి, టీపీసీసీ ఉపాధ్య‌క్షురాలు ఆత్రం సుగుణ‌, కంది శ్రీనివాస రెడ్డి లతో కలిసి వార్దా బయలుదేరి వెళ్లారు.