16-11-2025 12:00:00 AM
డిప్యూటీ సీఎం కోసమే కలిశారన్న ఊహాగానాలు
పాట్నా, నవంబర్ 15: బిహార్‌లో వరుసగా ఐదోసారి నీతీశ్‌కుమార్ నాయకత్వం లోని కూటమి గెలవడంతో కేంద్ర మంత్రి చిరాగ్ పాసవాన్ శనివారం సీఎం నీతీశ్‌కుమార్ నివాసానికి వెళ్లి అభినందనలు తెలిపారు. తాను సీఎంనె కలిసిన ఫొటోలను చిరాగ్ పాసవాన్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి.
కాగా బిహార్ ఎన్నికల్లో ఘన విజయం సాధించినందుకు నీతీశ్‌కుమార్ నివాసానికి వెళ్లి అభినందనలు తెలియజేసినట్లు చిరాగ్ పాసవాన్ పేర్కొన్నప్పటికీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి పక్షమైన ఎల్‌జేపీ(రాం విలాస్) బలమైన ప్రదర్శ చేయడంతో పాసవాన్ ఉప ముఖ్యమంత్రి పదవిపై దృష్టి సారి స్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సీఎం పీఠంపై ఊహాగానాలు చెలరేగుతున్న వేళ ఆయన నీతీశ్‌ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఈ విషయం గురించి చర్చించడానికే ఆయన నీతీశ్‌ను కలిసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా బిహార్‌లో రెండు దశల్లో జరిగిన ఎన్నికలకు శుక్రవారం ఫలితాలు వెలువడ్డాయి. ఇందు లో ఎన్డీయే కూటమి 245 సీట్లకు గాను 202 సీట్లను కైవసం చేసుకొని ఘన విజ యం సాధించింది. అయిదేళ్ల కిందట ఒకేఒక్క స్థానానికే పరిమితమైన లోక్ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ విలాస్) తాజా ఫలితాల్లో 19 స్థానాలు గెలిచి సత్తా చాటింది. ఈ విజయంలో పార్టీ అధినేత చిరాగ్ పాస్వాన్ కీలకపాత్ర పోషించారు.