calender_icon.png 16 November, 2025 | 11:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోదీ, నితీష్ 10 వేల మ్యాజిక్

16-11-2025 12:00:00 AM

-జేడీయూకు కంచుకోటగా మహిళా ఓటర్లు

- ప్రభుత్వంలో మహిళలకే పెద్దపీట

-పురుషుల కంటే అధికంగా 10 శాతం మహిళా ఓటు

బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అఖండ విజయానికి ప్రధాని మోదీ, సీఎం నితీష్ రూ.10వేల మ్యాజిక్ ఎంతో దోహ దం చేసింది. సీఎం నితీష్ కుమార్ మహిళా ఓటు బ్యాంకును కాపాడుకోవడంలో పట్టుసాధించారు. దశాబ్దాలుగా ఎన్నికలలో జేడీయూకు మహిళా ఓటర్లు మద్దతుగా నిలుస్తున్నారు.

నితీష్ నేతృత్వంలోని జేడీ యూ కూడా పార్టీలో, పథకాలు, ప్రభు త్వ విధానాలలో కూడా బీహార్ మహిళలకు ప్రాధాన్యం ఇస్తోంది. దీంతో మహిళా ఓటర్లు జేడీయూకు కంచుకోటగా ఉంటున్నారు. ‘బీహార్ మహిళల విశ్వాసం గెలిచింది.. ఎన్డీయే గెలిచింది, బీహార్ గెలిచింది.(జీతా హై బీహార్ కి మహిళావో కా విశ్వాస్... జీతా హై ఎన్డీయే, జీతా హై బీహా ర్’ అని జేడీయూ ఎక్స్‌లో పోస్టు చేసింది.

నితీష్ కుమార్ ప్రభుత్వంలో బీహార్ మహిళలు ఇప్పటికే అనేక ప్రయోజనాలను పొం దుతుండగా, అసెంబ్లీ ఎన్నికల కు ముందు జేడీయూ వారిపట్ల మరింత క్రియాశీలకంగా వ్యవహరించింది. 2025 బీహార్ ఎన్నికలకు ముందు, ప్రభుత్వం మహిళల కోసం ఉద్దేశించిన 7,500 కోట్ల ప్రత్యక్ష ప్రయోజన బదిలీ పథకం అయిన ముఖ్యమంత్రి మహిళా రోజ్‌గార్ యోజనను ప్రారంభించింది. ఈ పథకం కింద, 1.2 కోట్ల మంది మహిళలు ఒక్కొక్కరికి 10వేల చొప్పున నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసింది. ఈ సంవత్సరం ప్రారంభంలో ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.

పంచాయితీలలో మహిళలకు 50% రిజర్వేషన్ (2006), రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 35% కోటా (2013)తో సహా బీహార్‌లోని ఇతర మహి ళా కేంద్రీకృత పథకాలకు 10వేల బదిలీ అగ్రస్థానంలో ఉంది. 125 యూనిట్ల ఉచితవిద్యుత్, సమాజిక పింఛన్ల పెంపు, మహి ళల ఖాతాల్లో రూ.10 వేల జమ వంటివి ఎన్డీయే కూటమి భారీ విజయానికి దోహదంచేశాయి. 2025 బీహార్ ఎన్నికల్లో, మహిళా ఓటర్ల సంఖ్య పురుషుల కంటే ఎక్కువగా ఉంది.

పాట్నాలో పురుష ఓటర్ల సంఖ్య మహిళా ఓటర్ల సంఖ్యను మించిపోయింది. మొత్తంమీద, మహిళల ఓటింగ్ శాతం 71.78% ఉంటే పురుషుల ఓటింగ్ శాతం 62.98%గా ఉంది. ఈ ఎన్నికల్లో పురుషుల కంటే మహిళలే 10 శాతం అధికంగా ఓటేశారు. గత బీహార్ ఎన్నికల ఫలి తాల ట్రెండ్స్ కూడా నితీష్ కుమార్ పార్టీ పురుషుల కంటే మహిళా ఓటర్ల వాటా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గెలిచిందని తెలుస్తుంది.

2025 ఎన్నికల్లో నితీశ్ నేతృత్వంలోని ఎన్డీయే 202 సీట్లతో ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘనత సాధించడంలో ఎన్డీయే కూటమికి మహిళా ఓటర్లు వెన్నుదన్నుగా నిలిచారు. వచ్చే ఎన్నికల్లో కూడా ఇదే స్ట్రాటజీని కొనసాగించే యోచనలో నితీష్ వ్యూహం పన్నుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొకుంటున్నారు.