calender_icon.png 16 November, 2025 | 2:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రముఖ యూట్యూబర్‌కు ఎన్నికల్లో ఎదురు దెబ్బ

16-11-2025 12:00:00 AM

-95 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నా మనీశ్ కశ్యప్‌కు తప్పని ఓటమి

-చన్‌పటియా నుంచి జన్‌సురాజ్ అభ్యర్థిగా పోటీ

-50 వేలకు పైగా ఓట్ల తేడాతో ఘోర పరాజయం

పాట్నా, నవంబర్ 15: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ యూట్యూబర్ మనీశ్ కశ్యప్‌కి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. చన్‌పటియా నియోజకవర్గంలో జన్‌సురాజ్ అభ్యర్థిగా పోటీ చేసిన మనీశ్ కశ్యప్ శుక్రవారం వెలువడిన ఫలితాల్లో 50వేలకు పైగా ఓట్ల తేడాతో ఓటమి  పాలయ్యారు.

సోషల్ మీడియాలో పాపులారిటీ, 96 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నప్పటికీ ఆయన ఎన్నికల్లో గెలవలేకపోయారు. చన్‌పటియా నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ రంజన్ బీజేపీ అభ్యర్థి ఉమాకాంత్ సింగ్‌పై 37,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఈ స్థానం నుంచి పోటీ చేసిన మనీశ్ కశ్యప్ 50 వేలకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు.

సోషల్ మీడియాలో ఉన్న ప్రజాదరణ ఎన్నికల్లో ఓట్లుగా మారలేదు తమిళనాట బిహార్ వలస కూలీలపై దాడులు జరుగుతున్నాయంటూ 2023లో వీడియోలను రూపొం దించడంతో మనీశ్ అప్పట్లో వార్తల్లో నిలిచారు. వలస కూలీలపై తమిళనాడులోని ప్రజలు దాడులు చేసి చంపుతున్నారంటూ మనీశ్ రూపొందించిన పలు వీడియోలు 2023లో సంచలనం సృష్టించడంతో తమిళనాడు, బిహార్ పోలీసులు విచారణ చేపట్టారు.

దర్యాప్తులో అవి నకిలీ వీడియోలని తేలడంతో వలసకూలీలపై తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో అప్పట్లో తమిళనాడు పోలీసులు అతడిని అరెస్టు చేశారు. 2024లో మనీశ్ బీజేపీలో చేరారు. అనంతరం జన్‌సురాజ్ పార్టీలో చేరి చన్‌పటియా నియోజకవర్గం నుంచి 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు.