23-08-2025 01:01:34 AM
గరిడేపల్లి, ఆగస్టు 22: ప్రజలకు అందించే సేవలకు చిరునామా గా ప్రముఖ నటుడు పద్మ విభూషణ్ చిరంజీవి నిలుస్తారని చిరంజీవి ప్రజా సేవా సమితి మండల అధ్యక్షులు కొండ సైదులు గౌడ్ అన్నారు. మండలంలోని అబ్బిరెడ్డిగూడెం గ్రామంలో చిరంజీవి అభిమాన సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్ చిరంజీవి70,వ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, మెటీరియల్ ఉచితంగా అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ చిరంజీవి నటుడుగా రాణిస్తూ మరోవైపు సమాజ సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నాడన్నారు. రక్తదానం, నేత్రదానం లాంటి సేవా కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహిస్తూ కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్ ను హాస్పటల్లో ఉచితంగా అందించి ఎందరో ప్రాణాలను కాపాడి ఆదర్శంగా నిలిచారన్నారు.
ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు తోడేటి వెంకటేశ్వర్లు, నాయకులు ఎడవెల్లి ఉపేందర్ రెడ్డి,బెజ్జం రమేష్,రేవూరి వీరస్వామి,షేక్ రంజాన్,రేవూరి సైదులు,మాధ వీరబాబు,గోలి మదార్,గూడెపు యాదగిరి,పాఠశాల ఉపాధ్యాయులు ఎలక సైదిరెడ్డి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.