calender_icon.png 23 August, 2025 | 5:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతాను

23-08-2025 01:00:56 AM

చర్ల,(విజయక్రాంతి): భద్రాచలం నియోజకవర్గం అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెల్ల వెంకటరావు అన్నారు. శుక్రవారం చర్ల మండలంలో సీసీ రోడ్ల నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమాలలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... నియోజక వర్గాన్ని అభివృద్ధి చేయడామే లక్ష్యంగా చర్ల మండలంలో పనులకు శంకుస్థాపనలు చేస్తున్నట్లు ,ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం గా పనిచేస్తున్నామ ని మండలంలో ఎటువంటి సమస్యలు ఉన్న తమ వద్దకు తీసుకురావాలని, పరిష్కార మార్గాలను అన్వేషించే ప్రయత్నం చేస్తామన్నారు.