calender_icon.png 31 October, 2025 | 7:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

“రన్ ఫర్ యూనిటీ”లో పాల్గొన్న చిరంజీవి

31-10-2025 01:36:01 PM

హైదరాబాద్: సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని పలు చోట్ల 'రన్ ఫర్ యూనిటీ'(Run for Unity) నిర్వహించారు. డీజీపీ శివధర్ రెడ్డి, చిరంజీవి, సీపీ సజ్జనార్ నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో(People's Plaza) ఐక్యత రన్ ను జెండా ఊపి ప్రారంభించారు. ఈస్ట్ జోన్ పోలీసుల ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం నిర్వహించారు. ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి వరకు రన్ కొనసాగింది. కూకట్ పల్లిలో ఐక్యత రన్ ను ఏసీపీ రవి కిరణ్ రెడ్డి ప్రారంభించారు. జేఎన్ టీయూ నుంచి నెక్సస్ మాల్ వరకు రన్ కొనసాగింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్(Secunderabad Parade Ground) నుంచి జేబీఎస్ వరకు కొనసాగిన ఐక్యత రన్ పెద్ద సంఖ్యలో యువత, పోలీసులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రముఖ హీరో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) మాట్లాడుతూ... డీప్ ఫేక్ అనేది పెద్ద గొడ్డలిపెట్టు లాంటిదన్నారు. డీప్ ఫేక్ అంశాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లానని చిరంజీవి తెలిపారు. డీజీపీ, సీపీ సజ్జనార్ డీప్ ఫేక్ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ కేసును సీపీ సజ్జనార్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. డీప్ ఫేక్, సైబర్ నేరాలకు భయపడాల్సిన అవసరం లేదని చిరంజీవి సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ చాలా బలంగా ఉందని తెలిపారు. డీప్ ఫేక్ నియంత్రణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక చట్టాలు లేకపోతే డీప్ ఫేక్ వల్ల భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు వస్తాయన్నారు.