calender_icon.png 31 October, 2025 | 12:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కామెంట్ వెనుక కహానీ అదేనా?

31-10-2025 01:51:58 AM

ఇటీవలే ‘తెలుసు కదా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది రాశి ఖన్నా. సిద్దు జొన్నలగడ్డ హీరోగా రూపొందిన ఈ సినిమాలో రాశి ఖన్నా, శ్రీనిధిశెట్టి కథానాయికలుగా నటించారు. ఈ చిత్రం అక్టోబర్ 17న విడుదలై, మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఈ సినిమాలో మంచి నటనతో ఆకట్టుకున్న రాశి ఖన్నా ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా తన లవ్ లైఫ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను రెండుసార్లు ప్రేమలో పడ్డానని, అందులో ఒకటి సినిమా ల్లోకి రాకముందు అని చెప్పింది.

రెండోది ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాతేనని స్పష్టం చేసిందీ ఢిల్లీ సుందరి. కానీ, తాను ప్రస్తుతం రిలేషన్‌షిప్‌లో ఉన్నానా..? లేనా? అనేది చెప్పలేనన్న ది.  అయితే, రాశి మాటలను బట్టి ప్రస్తుతం ఆమె ఎవరితోనో ప్రేమలో ఉన్నట్ట నిపిస్తోందంటున్నవారే ఎక్కువ. ఇదిలావుంటే, తాజాగా తన ఇన్‌స్టా స్టోరీలో రాశి ఒక ఫొటో షేర్ చేసింది. అందులో ఆమె ఒక వ్యక్తిని కౌగిలించుకుని ఉంది. అది ఎవరు అనేది మాత్రం ముఖం కనిపించడం లేదు. ఆ ఫొటోకు ‘కౌగిలించుకుంటే ఈ ప్రపంచం సున్నితంగా కనిపిస్తుంది’ అని వ్యాఖ్యను జోడించింది రాశి.

దీంతో ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. రాశి ఈ ఫొటోను పంచుకోవటం ద్వారా తన రిలేషన్‌షిప్ గురించి పరోక్షంగా హింట్ ఇచ్చేసిందంటున్నారు నెటిజన్లు. ఫొటోలో ఉన్నది రాశి సీక్రెట్ లవరే అని, తాను రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు ఇలా కన్‌ఫార్మ్ చేసేసినట్టేనని, ఇక తెలియాల్సిందల్లా ఆ వ్యక్తి ఎవరన్నదేనని చర్చించుకుంటున్నారు. రాశితో ప్రేమలో ఉన్న వ్యక్తి సినీరంగానికి చెందిన వాడా..? కాదా? అనేది తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఈ విషయాన్ని రాశి ఎప్పుడు బయటపెడుతుందో చూడాలి. ప్రస్తుతం ఆమె పవన్‌కల్యాణ్ సరసన ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అటు హిందీలోనూ ఒక సినిమా చేస్తోందని సమాచారం.