మద్దికుంటలో చిరుత ఆనవాళ్లు
24-05-2024 02:27 AM
భయాందోళనలో గ్రామస్తులు
మంథని, మే23 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మద్ది కుంటలో చిరుతపులి సంచారంపై స్థానికు ల్లో భయాందోళనలు నెలకొన్నాయి. గురు వారం ర్రాతి పులి వచ్చి ఉంటుందని, చిరుత అడుగులను పోలిన పాదాల అచ్చులను ఫొటో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. విషయం అటవీ శాఖ అధికారులు చేరడంతో చిరుత సంచారంపై పరిశీలి స్తున్నారు. చిరుత సంచరిస్తున్నదనే సమా చారంతో మద్దికుంటతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చెందు తున్నారు. ఒంటరిగా బయటకు వెళ్లడానికి భయపడుతున్నారు.






