భద్రాచలంలో నర్సింగ్ విద్యార్థిని మృతి
భద్రాచలం : స్థానిక మారుతి నర్సింగ్ కాలేజీ వద్ద ఉద్రికత్త చోటుచేసుకుంది. నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. దీంతో మారుతి నర్సింగ్ కాలేజీ విద్యార్థులు, బంధువులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బిఎస్సి నర్సింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న కారుణ్య అనే విద్యార్థిని గురువారం అపస్మారక స్థితిలో, గాయాలతో కాలేజీ ప్రాంగణంలో పడిపోయింది. అది గమనించిన యాజమాన్యం స్థానిక దావాఖనాకు తరలించారు. కారణ్య చికిత్స పొందుతూ.. నిన్న సాయంత్రం మృతి చెందింది. విద్యార్థిని మృతితో తోటి విద్యార్థులు, బంధువులు శుక్రవారం న్యాయం చేయాలంటూ కాలేజీ ముందు ఆందోళనకు దిగారు. డైరెక్టర్ ఎస్ఎస్ కాంతారావు, అతడి డ్రైవర్ పై దాడికి పాల్పడ్డారు. కాలేజీని సీజ్ చేయాలంటూ నినాదాలు చేశారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోని కాలేజీ డైరెక్టర్ పై దాడిని అడ్డుకున్నారు.






