calender_icon.png 18 May, 2025 | 6:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉక్రెయిన్ సైన్యంపై క్లోరోపిక్రిన్ ప్రయోగం

04-05-2024 12:15:25 AM

రష్యా నిషేధిత గ్యాస్ ప్రయోగించిందన్న అమెరికా

నిరాధార ఆరోపణలని కొట్టిపారేసిన రష్యా

కీవ్, మే 3: రెండేండ్లుగా కొనసాగుతున్న యుద్ధంలో రష్యా తాజాగా ఉక్రెయిన్ సైనికులపై నిషేధిత క్లోరోపిక్రిన్ గ్యాస్‌ను ప్రయోగించిందని అమెరికా సంచనల ఆరోపణలు చేసింది. కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ (సీడబ్ల్యూసీ) 1993 ప్రకారం నిషేధించిన ఈ గ్యాస్‌ను ఉక్రెయిన్ సైనికులను నిలువరించేందుకు రష్యా వాడిందని అమెరికా ఆరో పించింది. సీడబ్ల్యూసీపై రష్యా కూడా సంత కం చేసింది. నైట్రోక్లోరోఫాం అని కూడా పిలిచే ఈ గ్యాస్ యుద్ధరంగంతోపాటు ఎక్కడా వాడకూడదని ప్రపంచ దేశాలు ఒప్పందం చేసుకొన్నాయి.

దీనిని రష్యా ఇటీవలికాలంలో భారీగా ఉత్పత్తి చేస్తూ ఉక్రెయి న్‌తో యుద్ధంలో వాడుతున్నదని అమెరికా ఆరోపించింది. క్లోరోపిక్రిన్‌ను తొలిసారి మొదటి ప్రపంచ యుద్ధంలో వినియోగించారు. పలురకాల కెమికల్స్‌తో తయారుచేసే ఈ గ్యాస్‌ను ప్రయోగిస్తే మనుషులు ఊపిరి తీసుకోవటం కష్టమవుతుంది. తీవ్రంగా కండ్ల మంటలు వస్తాయి. చర్మం కూడా కాలిపోతున్న భావన కలుగుతుంది. ఇది ఊపి రితిత్తులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఈ గ్యాస్‌ను కొన్ని దేశాల్లో ప్రజా ఉద్యమాల్లో అల్లరిమూకలను చెదరగొట్టేందుకు వాడేవారు. 1993 తర్వాత పూర్తిగా నిషేధించారు. తాజాగా ఈ గ్యాస్‌ను రష్యా గ్రనేడ్లలో నింపి తమ సైనికులపై రష్యా వాడుతున్నదని ఉక్రెయిన్ ఆరోపించింది.