calender_icon.png 18 May, 2025 | 11:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘రేవణ్ణ’పై కిడ్నాప్, అత్యాచారం కేసు

04-05-2024 12:17:31 AM

తండ్రీకొడుకులపై నమోదు చేసిన సిట్

బాధిత మహిళ కుమారుడు రాజు ఫిర్యాదు మేరకు ఫైల్

కృష్ణలీలలు అంటూ కర్ణాటక మంత్రి వ్యంగ్యాస్త్రాలు

కర్ణాటక, మే 3: కర్ణాటకలో సంచలనం రేపిన ఎంపీ ప్రజ్వల్ లైంగిక వేధింపుల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు హెచ్‌డీ రేవణ్ణ, ఆయన మనవడు ప్రజ్వల్‌పై ఇప్పటికే అత్యాచారం, లైంగిక హింస, అశ్లీల చిత్రాలను అప్ లోడ్ చేయటం వంటి నేరాలకు సంబంధించిన కేసులు నమోదు చేశారు. తాజాగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్.. అపహరణ, అత్యాచారం కేసులు కూడా నమోదు చేసింది. రాజు, అతని తల్లి ఆరేళ్లు రేవణ్ణ కుటుంబానికి చెందిన ఇల్లు, ఫామ్‌హౌస్‌లో పనిచేసి మూడేళ్ల కింద మానేశారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికలకు ముందు రేవణ్ణ అనుచరుడు సతీశ్ అనే వ్యక్తి రాజు తల్లిని తీసుకెళ్లాడు. ఎన్నికల తర్వాత ఇంటికి పంపించాడు. ఏప్రిల్ 29న మళ్లీ సతీశ్ రాజు వద్దకు వెళ్లి హెచ్‌డీ రేవణ్ణ తీసుకురమ్మన్నారని ఆమెను బలవంతంగా తీసుకెళ్లాడు. మే 1న రాజు తల్లి వీడియోలు వైరల్ అయ్యాయని అతనికి తెలిసింది. అదే రోజు రాత్రి తన తల్లి ఎక్కడుందో సతీశ్‌ను రాజు ఆరా తీశాడు. దీనిపై రాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ప్రజ్వల్, అతని తండ్రి హెచ్‌డీ రేవణ్ణపై అపహరణ, అత్యాచారం కేసులను సిట్ నమోదు చేసింది.   

కృష్ణ లీలలు...

రేవణ్ణ లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి కర్ణాటక మంత్రి రామప్ప తిమ్మాపూర్ వివాదాస్పద వ్యా ఖ్యలు చేశారు. ప్రజ్వల్‌ను కృష్ణుడితో పో లుస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘ఈ దేశంలో జరిగిన దానితో పోలిస్తే ఇదేమం త చెడ్డ విషయం కాదు. ఇది గిన్నీస్ వరల్డ్ రికార్డు కోసం సృష్టించారు. భక్తితో చాలామంది మహిళలతో శ్రీకృష్ణుడు ఉన్నాడు. కానీ, ప్రజ్వల్ విషయంలో ఇలా జరగలేదు’ అంటూ విమర్శించారు. రామప్ప కామెంట్స్‌పై బీజేపీ వెంటనే స్పందించింది. శ్రీకృష్ణుడిని కర్ణాటక ప్రభుత్వం అవమానించిందని, రామ ప్పను తక్షణమే కేబినెట్, పార్టీ నుంచి తొలగిం చాలని డిమాండ్ చేసింది. రామప్ప వ్యాఖ్యలను కాంగ్రెస్ సైతం ఖండించింది. ఆయన ప్రకటన పార్టీ అభిప్రాయం కాదని తెలిపింది.