04-05-2024 12:13:49 AM
చాంగ్ మిషన్‌ను ప్రయోగించిన చైనా
జాబిల్లిపై శిలలు, మట్టిని భూమికి తీసుకురానున్న ప్రోబ్
అక్కడి పరిస్థితులు, ఖనిజాల గుట్టు విప్పేందుకు ప్రయత్నాలు
చైనా, మే 3: చంద్రుడిపై శిలలు, మట్టిని సేకరించేందుకు చైనా లూనార్ ఎక్స్‌ప్లోరేషన్ ప్రాజెక్టులో భాగంగా కొత్త ప్రయోగాన్ని చేపట్టింది. శుక్రవారం చంద్రుడి అవతలి భాగాని కి చాంగ్ మిషన్‌ను ప్రయోగించింది. ఈ ప్రాజెక్టు సఫలమైతే చంద్రుడి వెనకవైపు నమూనాలు సేకరించిన తొలి దేశంగా చైనా నిలవనుంది. హైనాన్ ప్రావిన్స్‌లోని వెన్‌చాంగ్ అంతరిక్ష ప్రయోగ కేంద్ర ం నుంచి లాంగ్‌మార్చ్ రాకెట్ ద్వారా ఈ ప్రోబ్‌ను ప్రయోగించింది చైనా. అంతేకాకుండా ఈ మిషన్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఐక్యూబ్ ఖమర్ క్యూబ్‌శాట్ శాటిలైట్ కూడా ఉంది. దీన్ని షాంఘైలోని స్పేస్ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్, సుపార్కొ (పాక్ అంతరిక్ష సంస్థ) సంయుక్తంగా రూపొందించాయి.
నమూనాల సేకరణ..
చాంగ్ మిషన్ ప్రధాన లక్ష్యం చంద్రుని దక్షిణ ధృవాన్ని చేరుకోవడం. అక్కడి మట్టి, శిలల నమూనాలను సేకరించడం. చంద్రుడిపై 2 మీటర్ల లోతులో 2 కేజీల పదార్థాన్ని సేకరించి ఈ ప్రోబ్ తిరిగి భూమికి తీసుకువస్తుంది. ఈ మిషన్‌లో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించినట్లు చైనా శాస్త్రవేత్తలు తెలిపారు. రెట్రోగ్రేడ్ ఆర్బిట్ కంట్రోల్, ఇంటెలిజెంట్ శాంపిలింగ్ వంటి సాంకేతికతలు వాడినట్లు ప్రాజెక్టు డిప్యూటీ డైరెక్టర్ పేర్కొన్నారు. చంద్రుడి దక్షిణ ధృవంలో పరిశోధనల ఆధారంగా అక్కడి పరిస్థితులు, ఖనిజాలు, పుట్టుకకు సంబంధించిన ఆధారాలు లభించే అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.
గతంలోనూ ప్రయోగాలు..
2019లో చాంగ్ మిషన్‌ను ప్రయోగించింది. ఆ ప్రాజెక్టులో గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్‌ను చైనా పంపిం ది. అనంతరం 2020లో చంద్రుడి ముందుభాగం నుంచి నమూనాలను సేకరించడంలో చైనా మిషన్ విజయవంతమైంది. 1970లో అమెరికా అపోలో మిషన్‌తోనూ ఇది సాధ్యపడలేదు. చైనా సేకరించిన నమూనాల విశ్లేషణలో చంద్రుని ఉపరితలంలో నీటి ఉనికి ఉన్నట్టు తేలింది. గత వారం లో ముగ్గురు చైనా వ్యోమగాములు అంతరిక్షకేంద్రానికి వెళ్లారు. భారత్‌కు కూడా చంద్రునికి సంబంధించి కీలక మిషన్లను చేపట్టడంలో నిమగ్నమై ఉంది. చంద్రయాన్ ప్రజ్ఞాన్ రోవర్, విక్రమ్ ల్యాండర్‌ను చంద్రుడిపై సేఫ్ ల్యాండింగ్ చేసింది. ఈ ప్రయోగంతో చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన మొదటి దేశంగా భారత్ చరిత్రకెక్కింది.