05-09-2025 05:21:11 PM
వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని స్థానిక చెరువు వద్ద ఏర్పాటుచేసిన గణేష్ నిమజ్జనోత్సవ ఘాట్ ను చౌటుప్పల్ ఏసిపి మధుసూదన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడుతూ రాత్రి వేళల్లో నిమజ్జనోత్సవం నిర్వహించే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా విద్యుత్ దీపాలను పర్యవేక్షించాలని, వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు.