calender_icon.png 6 September, 2025 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతిని ఘనంగా నిర్వహించాలి

05-09-2025 04:07:30 PM

సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి

నకిరేకల్ (విజయక్రాంతి): ఈనెల12న సిపిఎం పార్టీ మాజీ అఖిల భారత ప్రధాన కార్యదర్శి, ఉత్తమ పార్లమెంట్రియన్, మార్క్సిస్టు మేధావి అమరజీవి కామ్రేడ్ సీతారం ఏచూరి ప్రథమ వర్ధంతిని ఘనంగా నిర్వహించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి(CPM District Secretary Tummala Veera Reddy) కోరారు. శుక్రవారం నకిరేకల్ పట్టణంలోని నర్రా రాఘవరెడ్డి భవనంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 12న నకిరేకల్ పట్టణ కేంద్రంలో జరిగే‌ సీతారాం ఏచూరి ప్రధమ వర్ధంతి సభకు మేధావులు, అభిమానులు, పార్టీ కార్యకర్తలు నాయకులు సానుభూతిపరులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యురాలు కందాల ప్రమీల, మండల కార్యదర్శి రాచకొండ వెంకట్ గౌడ్, టౌన్ కార్యదర్శి వంటే పాక వెంకటేశ్వర్లు, మండల కమిటీ సభ్యులు ఆకుల భాస్కర్, కొప్పుల అంజయ్య, గుడుగుంట్ల బుచ్చిరాములు, బండమీది ఎల్లయ్య, గింజల లక్ష్మి, కాడింగుల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.