calender_icon.png 6 September, 2025 | 1:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణేశుడి మండపాల వద్ద ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి పూజలు

05-09-2025 05:24:02 PM

వలిగొండ,(విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలో వివిధ కాలనీలలో ఏర్పాటుచేసిన గణేశుడు మండపాల వద్ద భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో గణేష్ నవరాత్రి ఉత్సవాలను అన్ని వర్గాల ప్రజలు కలిసి మెలిసి ఆనంద ఉత్సవాలతో నిర్వహించుకుంటారని అన్నారు. వై.ఎస్.సి.ఏ యువజన సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు.