calender_icon.png 14 January, 2026 | 1:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి: సీఐ వెంకట్ రెడ్డి

13-01-2026 11:03:57 PM

సిర్గాపూర్/కల్హేర్,(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్/కల్హేర్/కంగ్టి మండల కేంద్రంలల్లో మంగళవారం కంగ్టి సీఐ వెంకట్ రెడ్డి ప్రజలకు పిలుపు రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు, ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు ప్రతి పౌరుడూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సీఐ వెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా రాష్ట్ర పోలీస్‌శాఖ చేపట్టిన ‘అరైవ్‌ అలైవ్‌' రోడ్డు సేఫ్టీ ప్రచార కార్యక్రమంలో సర్పంచ్లు సైతం భాగస్వాములయ్యారని పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి ఒక్కరితో రోడ్డు భద్రతా మండలల్లో తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టంచేశారు.

ఈ సందర్బంగా సీఐ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ...ఇక నుంచి హెల్మెట్‌ ధరించకపోవడం, సీటుబెల్ట్‌ వినియోగం లేకపోవడం, వాహనం నడుపుతూ మొబైల్‌ వినియోగం, మద్యం సేవించి డ్రైవింగ్‌ చేయడం, రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌, హైవేలపై ఆటోల ఓవర్‌ లోడింగ్‌, మీటర్‌-యూనిఫాం నిబంధనలు ఉల్లంఘించడం, హైబీమ్‌ లైట్లు, ఎడమవైపు నుంచి ఓవర్‌ టేకింగ్‌పై ప్రత్యేకంగా దృష్టి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ మహేష్, ఎస్ఐ-2 నారాయణ,పోలీస్ సిబ్బంది, సర్పంచ్ శ్రీనివాస్ రావ్, ప్రజలు, విద్యార్థులు, యువత, మీడియా, ప్రజా ప్రతినిధులు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి, ప్రమాదాలు నియంత్రించాలని ప్రతిజ్ఞ చేయించారు.