calender_icon.png 14 January, 2026 | 1:07 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాఫిక్ నియమాలు పాటిస్తేనే ప్రాణాలకు భద్రత

13-01-2026 11:00:59 PM

వేములవాడ రూరల్ సీఐ శ్రీనివాస్

వేములవాడ,(విజయక్రాంతి): వేములవాడ రూరల్ సర్కిల్ పరిధిలో “అరివ్ అలైవ్” రోడ్డు భద్రతా అవగాహన కార్యక్రమం ప్రారంభమైంది. వట్టెంల గ్రామంలో  మంగళవారం నిర్వహించిన గ్రామస్థాయి సమావేశంలో రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ వెంకట్రాజం పాల్గొని రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ... ప్రతి ప్రయాణం సురక్షితంగా ముగిసి ప్రతి వ్యక్తి క్షేమంగా ఇంటికి చేరాలన్నదే “అరివ్ అలైవ్ ” థీమ్ ఉద్దేశమని చెప్పారు. అతివేగం, మద్యం సేవించి డ్రైవింగ్, హెల్మెట్, సీట్‌బెల్ట్ వాడకపోవడం, మొబైల్ వినియోగం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని, వాటిని నివారించాలంటే ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.