calender_icon.png 27 November, 2025 | 5:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

250 మందిని రక్షించిన సీఐఎస్‌ఎఫ్

27-11-2025 01:10:00 AM

ఉరి వద్ద పాక్ కుట్రలను ఛేదించిన 19 మంది సిబ్బంది వారికి ఈజీఎస్ డిస్క్ ప్రదానం 

న్యూఢిల్లీ, నవంబర్ 26: పాకిస్తాన్ ఉగ్ర కట్రలను భారత్ భద్రతా బలగాలు ఎప్పటికప్పుడు పసిగడుతూ.. దీటుగా బదులిస్తుం టాయి. అలాంటి ఒక కుట్రనే ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన పహల్గాం ఉగ్రదాడి మయంలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌ఎఫ్) ఛేదించి, 250 మంది ప్రాణాలను కాపాడింది. ఈ 250 మంది పౌరులను కాపాడడంతో ఎంతో ధైర్యసాహసాలు ప్రదర్శించిన 19 మంది సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిని తాజాగా సన్మానించారు. 

పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారతదేశం ప్రతిస్పందనగా ఆపరేషన్ సిందూర్ సమయం లో భారతదేశం -పాకిస్తాన్ వివాదం సమయం లో, జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లాలోని ఉరి వద్ద జలవిద్యుత్ ప్రాజెక్టులను సరిహద్దు అవతల నుంచి పాక్ ఉగ్ర షెల్లు లక్ష్యంగా చేసు కున్నాయి.

విమానాశ్రయాలు, కీలకమైన మౌలిక సదుపాయాలను రక్షించే పనిలో ఉన్న కేంద్ర పారిశ్రామిక భద్రతా దళానికి చెందిన 19 మంది సిబ్బంది, నియంత్రణ రేఖకు సమీపంలో ఉన్న ఒక ప్రాజెక్ట్‌పైన జరిగి న ఈ దాడిలో 250 మంది పౌరులను తమ ప్రాణాలను పణంగా పెట్టి, రక్షించారు. ఈ 19 మంది సీఐఎస్‌ఎఫ్ సిబ్బందిని మంగళవారం సత్కరించారు.ఈమేరకు సీఐఎస్‌ఎఫ్ పేర్కొంది.

‘మే 2025లో తీవ్రమైన సరిహద్దు షెల్లింగ్ మధ్య, ఉరి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్లలోని సీఐఎస్‌ఎఫ్ బృందాలు అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించాయి, కీలకమైన జాతీయ ఆస్తులను రక్షించాయి, వారి స్వంత ప్రాణాలను ఫణంగా పెట్టి, 250 మంది పౌరులను కాపాడారు’ అని సీఐఎస్‌ఎఫ్ ఒక ప్రకటనలో తెలిపింది. ‘కమాండెంట్ రవి యాదవ్ నేతృత్వంలో 19 మంది సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది పాక్ పన్నాగాలను చిత్తుచేశారు. సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది రక్షించిన పౌ రులలో జాతీయ జలవిద్యుత్ సంస్థ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు ఉన్నారు.

దేశం పట్ల వారి ధైర్యం, నిబద్ధతను గుర్తించినందుకు భద్రతా సిబ్బందికి డైరెక్టర్ జనరల్ డిస్క్ లభించింది. ఈ గౌరవాన్ని కమాండింగ్ ఆఫీసర్ రవి యాదవ్‌తో పాటు, డిప్యూటీ కమాండెంట్ మనోహర్ సింగ్, అసిస్టెంట్ కమాండెంట్ సుభాష్ కుమార్, ఇన్‌స్పెక్టర్ దీపక్ కుమార్ ఝా, సబ్-ఇన్‌స్పెక్టర్లు అనిల్ కుమార్, దీపక్ కుమార్, అసిస్టెంట్ సబ్-ఇన్‌స్పెక్టర్లు రాజీవ్ కుమార్,

సుఖ్దేవ్ సింగ్, హెడ్ కానిస్టేబుళ్లు మనోజ్‌కుమార్ శర్మ, రామ్ లాల్, గుర్జిత్ సిం గ్ అందుకున్నారు. కానిస్టేబుళ్లు సుశీల్ వి కాం బ్లే, రజిక్ రఫీక్, రవీంద్ర వాంఖడే, త్రిదేవ్ చ క్మా, సోహన్ లాల్, ముఫీద్ అహ్మద్, మహే ష్ కుమార్, సందెనబోయిన రాజులకు డిస్క్ అందజేసినట్లు అధికారులు తెలిపారు.