calender_icon.png 27 November, 2025 | 5:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బకాయిలివ్వండి సార్లూ!

27-11-2025 12:56:29 AM

చిన్న కాంట్రాక్టర్లకు సర్కారు మొండిచేయి

  1. పెండింగ్‌లో మన ఊరు-మన బడి నిధులు రూ.361 కోట్లు
  2. బిల్లులు రాక.. అప్పులు తీరక విలవిల 
  3. ఆందోళనబాట తప్పదంటున్న కాంట్రాక్టర్లు

హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): పెండింగ్ బిల్లుల కోసం కూడా కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న చిన్న కాంట్రాక్టర్లు వారు.. మన ఊరు బడి కోసం పనులు పూర్తిచేసిన ఆ కాంట్రాక్టర్లు, ఇప్పుడు పెండింగ్ బిల్లుల కోసం అరిగోస పడుతున్నారు. గత రెండేళ్లుగా ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నా నిధులను మాత్రం విడుదల చేయడంలేదని బాధిత కాంట్రాక్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రూ. 5 లక్షలలోపు పనులు, రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలు, ఆపై పనులకు సంబంధించిన బిల్లులే వారికి రావాల్సింది. వీటిని కూడా ప్రభుత్వం సంవత్సరాల కొద్దీ బకాయి పెడుతున్నది. దీంతో తెచ్చిన రుణాలకు వడ్డీలు కట్టలేకపోతున్నామని చిన్న కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ప్రభుత్వం తమకు ఇవ్వాల్సిన బిల్లులు వెంటనే విడుదల చేయకుంటే ఆందోళన బాట పట్టక తప్పదని వారు సర్కారును హెచ్చరిస్తున్నారు. 

గత కేసీఆర్ ప్రభుత్వం మన ఊరుము బడి ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టి 9 వేల ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ, నిర్మాణ పనులను చేపట్టింది. దాదాపు 900 నుంచి వెయ్యి మంది కాంట్రాక్టర్లకు పనులు అప్పగించింది. డైనింగ్ హాల్, మరుగుదొడ్ల నిర్మాణం, కాంపౌండ్ వాల్, ఎలక్ట్రికల్, మైనర్ వర్క్, మేజర్ వర్క్‌లను చిన్న కాంట్రాక్టర్లు చేశారు. పెయింటింగ్ వర్క్‌తోపాటు, స్మార్ట్ క్లాస్‌లకు సంబంధించి డిజిటల్ బోర్డులు ఏర్పాటు పనులను మాత్రం ఓ బడా కంపెనీకు అప్పగించారు.

రూ.5 లక్షల లోపు పనులు చేసిన వాళ్లకు దాదాపు రూ. 141 కోట్లు, రూ. 5-10 లక్షల లోపు పనులు చేసిన వాళ్లకు రావాల్సిన బిల్లులు రూ. 75 కోట్లు, రూ. 10-30 లక్షలలోపు రావాల్సిన బిల్లులు రూ. 75 కోట్లు, రూ. 30 లక్షలకు పైగా రావాల్సిన బిల్లులు రూ. 50 కోట్లకుపైగా ఉంటాయి.

ఇలా మొత్తం కలిపి చిన్న కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బిల్లులు రూ. 361 కోట్ల వరకు పెండింగ్‌లో ఉన్నా యి. కానీ, బడా కంపెనీకు దాదాపు రూ. 200 కోట్లు పనులు చేస్తే రూ. 150 కోట్లు వరకు విడుదల చేయగా, డిజిటల్ బోర్డులకు సంబంధించి సుమారు రూ. 800 కోట్ల పనులకు గానూ రూ. 600 కోట్ల వరకు విడుదల చేసినట్లు ఓ చిన్న కాంట్రాక్టర్ తెలిపారు.  

ఆర్థిక శాఖ వద్ద ఫైల్ పెండింగ్..

కాంట్రాక్టర్ల బిల్లులకు సంబంధించిన దస్త్రం ఆర్థిక శాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. పనులు విద్యాశాఖకు సంబంధించినవి కావడంతో వీరి బిల్లులను క్లియర్ చేయాలని కోరుతూ ఆర్థిక శాఖకు పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే రెండు మూడు సార్లు ప్రతిపాదనలు కూడా పంపించింది. ఇటీవల పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ ఆర్థిక శాఖకు లేఖ కూడా రాసినట్లు సమాచారం. ప్రభుత్వం ఇస్తే విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నట్లుగా 

ఆందోళన బాట..

బీఆర్‌ఎస్ హయాంలో రూ. 943 కోట్ల పనులకు 2023 ఏప్రిల్ వరకు రూ.581 కోట్లను విడుదల చేయగా, మిగిలిన రూ.361 కోట్లను ఇంతవరకూ విడుదల చేయలేదు. గతంలో సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఛాంబర్ వద్ద ఈ కాంట్రాక్టర్లంతా నిరసన వ్యక్తంచేశారు. పాఠశాల విద్యా శాఖ కార్యాలయం ముందు రెండుసార్లు  నిరసన వ్యక్తం చేశారు. అంతేకాకుండా పెం డింగ్ బిల్లులు విడుదల చేయాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డికి విన్న వించుకోగా, సీఎం ఆయన గతంలో లేఖ కూడా రాశారు. తాజాగా ఈనెల 25న కూడా మరోసారి కాంట్రాక్టర్లు సుఖేందర్ రెడ్డిని కలవగా డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్కతో ఆయన ఫోన్‌లో మాట్లాడడమే కాకుండా బిల్లులు విడుదల చేయాలని లేఖ కూడా రాయడం గమనార్హం.

మిత్తీలు కట్టలేకపోతున్నాం

ప్రభుత్వం వెంటనే మా బిల్లులను విడుదల చేయాలి. ఇద్దాం.. చేద్దాం... ఇవాళ, రేపు అంటూ కాలయాపన చేస్తున్నారుగానీ, బిల్లులు మాత్రం చెల్లించ డంలేదు. మిత్తీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నాం. చిన్న చిన్న బిల్లులే మావి. మాకు వర్క్‌అవుట్ కాని రేట్లకు కూడా పనులు చేశాం. బిల్లులు అడిగితే డబ్బు లు లేవు.. బడ్జెట్ లేదు అని అంటున్నా రు. ప్రభుత్వం బిల్లులు జారీచేయకుంటే వచ్చే నెలలో ఆందోళన బాట పట్టేందుకు సిద్ధమవుతున్నాం.

 వేదవ్యాస్, కాంట్రాక్టర్