27-11-2025 12:30:39 AM
ముషీరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించి బీసీలను రాజకీయ సమాధి చేయాలని కాంగ్రెస్, బీజేపీలు కుట్ర చేస్తున్నాయని, వారి కుట్రల ఫలితమే 60 శాతం ఉన్న బీసీలకు 17 శాతం రిజర్వేషన్లు దక్కాయని బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. బుధవారం హైదరా బాదులోని బషీర్‌బా ప్రెస్‌క్లబ్‌లో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో జాజుల శ్రీనివాస్‌గౌడ్ ప్రసంగిం చారు.
ఈ సందర్భంగా ఈ నెల 30న హైదరాబాదులో జరిగే బీసీల రాజకీయ యుద్ధ భేరి సభ పోస్టర్‌ను బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణ, కో చైర్మన్ కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్‌లతో కలిసి జాజుల ఆవి ష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన 42% రిజర్వేషన్లు దేవుడెరుగు గానీ, కనీసం గతంలో 2019లో జరిగిన సర్పంచ్ ఎన్నికల కంటే ఇప్పుడు జరిగే సర్పంచ్ ఎన్నికలలో నిట్ట నిలువునా తగ్గించడం చాలా అన్యా యం అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రోస్టర్ విధానం పేరుతో బీసీలను తడి గుడ్డతో గొంతు కోసిందన్నారు. 42% అమలు చేసి ఉంటే 5300 సర్పంచ్ స్థానాలు బీసీలకు దక్కేవని, 17% బీసీ రిజర్వేషన్లు అమలు చేయడం మూలంగా కేవలం 2,176 సర్పంచ్ స్థానాలు మాత్రమే బీసీలకు కేటాయించారని చెప్పారు. బీసీలకు రావాల్సిన స్థానాలను జనరల్ స్థానాలకు కేటాయించి రాష్ట్రంలో రెడ్ల రాజ్యాన్ని తీసుకురావాలని కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో 30 మండలాలలో ఒక్క గ్రామపంచాయతీ బీసీకి రిజర్వు కాలేదని, 80 మండలాలలో ఒకటి రెండు మాత్రమే రిజర్వ్ అయ్యాయని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 471 గ్రామపంచాయతీలకు ఒక్క గ్రామ పంచాయతీ కూడా బీసీలకు రిజర్వ్ చేయలేదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఏడు జిల్లాల్లో 10 శాతం లోపు బీసీ రిజర్వేషన్లు, పది జిల్లాల్లో 20 శాతం లోపు రిజర్వేషన్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఇష్టానుసారంగా ఎలాంటి శాస్త్రీయమైన ఆధారాలు లేకుండా బీసీ రిజర్వేషన్లు కేటాయించి బీసీలను పచ్చి మోసం చేశారని ఆరోపించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్, కేంద్రంలో బిజెపి బీసీల పట్ల వ్యతిరేక వైఖరి మూలంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు చారిత్రాత్మకంగా తీరని అన్యాయం జరుగుతుందన్నా రు. బీసీలకు అన్యాయం జరుగుతున్నా కేం ద్రమంత్రి కిషన్‌రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ స్పం దించకపోవడం విచారకరమన్నారు. బీసీలకు జరుగుతున్న అన్యాయం జీర్ణించు కోలేకే ఈరోజు బీసీ శ్రేణులు గాంధీభవనం ముట్టడించాయని, రేపు మాకు బిజెపి కార్యాలయాన్ని కూడా ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.
ఎన్నికల షెడ్యూల్ తో సంబంధం లేకుండా బీసీ జేఏసీ ఉద్యమాన్ని గల్లీ నుండి ఢిల్లీ వరకు తీవ్రతరం చేస్తామని అందులో భాగంగానే ఈ నెల 30వ తేదీన చలో హైదరాబాద్ పేరుతో ఇందిరా పార్క్ వద్ద బీసీల రాజకీయ యుద్ధభేరి సభను నిర్వహిస్తామని, డిసెంబర్ 8, 9వ తేదీల లో ఢిల్లీలో పార్లమెంట్ ను ముట్టడిస్తామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ గా పెరికే సురేష్ ను నియమిస్తూ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్, వర్కింగ్ చైర్మన్ గుజ్జ కృష్ణలు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ కో చైర్మన్ కులకచర్ల శ్రీనివాస్ ముదిరాజ్, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షులు తాటికొండ విక్రమ్ గౌడ్, బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షులు కనకాల శ్యాంకుర్మా, బీసీ జేఏసీ కో చైర్మన్ శేఖర్ సగర, జాజుల లింగం గౌడ్, వేముల రామకృష్ణ, ఈడిగ శ్రీనివాస్ గౌడ్, తారకేశ్వరి, సమతా యాదవ్, గౌతమి, వరికుప్పల మధు, గూడూరు భాస్కర్, వెంకటేష్ గౌడ్, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్ గౌడ్, ఇంద్రం రజక, కొప్పుల చందు, పద్మావతి, బండిగారి రాజు, భరత్ తదితరులు పాల్గొన్నారు.