calender_icon.png 27 November, 2025 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లె పోరు.. నేటి నుంచి నామినేషన్లు

27-11-2025 12:09:17 AM

నకిరేకల్ నియోజకవర్గంలో రెండు విడతల్లో సర్పంచ్  ఎన్నికలు వచ్చే నెల 11, 14 తేదీల్లో పోలింగ్ 

నకిరేకల్, నవంబర్ 26 (విజయ క్రాంతి): నకిరేకల్ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. తాజాగా ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేయడంతో మంగళవారం సాయంత్రం నుంచే ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ఈసారి మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించింది. నకిరేకల్ నియోజకవర్గంలోని నకిరేకల్, కేతేపల్లి, కట్టంగూర్, నార్కట్పల్లి, చిట్యాల మండలాలు తొలి విడతలో ఉండగా, రామన్నపేట మండలం రెండో విడతలో పోలింగ్కు వెళ్తోంది.

గ్రామాల్లో ఎన్నికల జోరు పెరిగి, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, భద్రతా ఏర్పాట్లలో యంత్రాంగం తుది సిద్ధతలను పూర్తి చేస్తోంది. దాదాపు 20 నెలల విరామం తర్వాత జరుగుతున్న ఈ ఎన్నికలపై ఆశావహుల్లో స్పష్టమైన ఉత్సాహం కనిపిస్తోంది. ఒకసారి ముందుగా హడావుడిగా జారీ చేసిన షెడ్యూల్ నిలిచిపోవడంతో నిరాశ చెందిన పలువురు అభ్యర్థులు, ఇప్పుడు తాజా షెడ్యూల్తో మళ్లీ ప్రచారంలో తలమునకలయ్యారు. పార్టీ రహిత ఎన్నికలైనా, అన్ని పార్టీల శ్రేణుల్లో వ్యూహరచన, బలపరీక్షల కోసం కసరత్తులు ముమ్మరం అయ్యాయి.

మండలాల వారీగా సర్పంచ్‌వార్డు సభ్యుల స్థానాలు 

నకిరేకల్ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో మొత్తం 126 గ్రామపంచాయతీలు, సుమారు 1200 వార్డు సభ్యుల స్థానాలు ఎన్నికలకు సిద్ధమైనాయి.

కట్టంగూర్ మండలం  22 సర్పంచ్ స్థానాలు, 206 వార్డు సభ్యులు

నకిరేకల్ మండలం  17 సర్పంచ్ స్థానాలు, 160 వార్డు సభ్యులు

కేతేపల్లి మండలం  16 సర్పంచ్ స్థానాలు, 160 వార్డు సభ్యులు

నార్కట్పల్లి మండలం  29 సర్పంచ్ స్థానాలు, 262 వార్డు సభ్యులు

చిట్యాల మండలం  18 సర్పంచ్ స్థానాలు, 180 వార్డు సభ్యులు

రెండో విడత  రామన్నపేట మండలం  24 సర్పంచ్ స్థానాలు, 232 వార్డు సభ్యులు

ఎన్నికల షెడ్యూల్  తొలి విడత 

నామినేషన్ల స్వీకరణ ప్రారంభం: నవంబర్ 27

నామినేషన్ల చివరి తేదీ: నవంబర్ 29

నామినేషన్ల పరిశీలన: నవంబర్ 30

ఉపసంహరణకు చివరి తేదీ: డిసెంబర్ 3 (మా. 3 గంటల వరకు)

అభ్యర్థుల తుది జాబితా: డిసెంబర్ 3

పోలింగ్: డిసెంబర్ 11 (ఉ. 7 నుంచి మ. 1 వరకు)

ఫలితాలు: డిసెంబర్ 11 (మ. 2 గంటల నుంచి కౌంటింగ్ అనంతరం)

 రెండో విడత 

నామినేషన్ల స్వీకరణ ప్రారంభం: నవంబర్ 30

నామినేషన్ల చివరి తేదీ: డిసెంబర్ 2

పరిశీలన: డిసెంబర్ 3

ఉపసంహరణకు చివరి తేదీ: డిసెంబర్ 6 (మా. 3 గంటల వరకు)

అభ్యర్థుల తుది జాబితా: డిసెంబర్ 6

పోలింగ్: డిసెంబర్ 14 (ఉ. 7 నుంచి మ. 1 వరకు)

ఫలితాలు: డిసెంబర్ 14 (మ. 2 గంటల నుంచి కౌంటింగ్ అనంతరం)

ఎన్నికల చర్చలు గ్రామాల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. ఎవరు బరిలో ఉంటారు? ప్రజలు ఎవరికి తీర్పు ఇవ్వబోతున్నారు? అన్న ఆందోళన, ఆసక్తి అభ్యర్థుల్లోనే కాదు, గ్రామస్తుల్లో కూడా కనిపిస్తోంది. పోలింగ్ తేదీలు దగ్గరపడుతుండటంతో పల్లెల్లో రాజకీయ వేడి మరింత పెరిగింది.