calender_icon.png 27 November, 2025 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దేశంలోనే ‘ఆర్‌ఈపీఎం’ల తయారీ!

27-11-2025 01:07:13 AM

  1. ఏడాదికి ఆరువేల టన్నుల ఉత్పత్తికి ప్రోత్సాహం
  2. రూ.7,280 కోట్ల వ్యయానికి క్యాబినెట్ అనుమతి
  3. చైనా ఆంక్షల నేపథ్యంలో మోదీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

న్యూఢిల్లీ, నవంబర్ 26: చైనా ఆంక్షల నేపథ్యంలో భారతదేశంలో అరుదైన ఎర్త్ పర్మ నెంట్ మాగ్నెట్ల(ఆర్‌ఈపీఎం)ను తయారు చేయడానికి మోదీ సర్కార్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి ంది. ఏడాదికి ఆరువేల టన్నుల ఉత్పత్తే లక్ష్య ంగా ప్రోహాత్సహిందుకు, ఇందుకు రూ. 7280కోట్లను ఖర్చుచేయడానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదిచింది. ఏడేళ్ల పాటు అమలులో ఉండే ఈ పథకానికి కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదించింది.

ఈ ఆర్‌ఈపీఎంల డిమాండ్‌ను ప్రస్తుతం భారతదేశం ప్రధానంగా దిగుమతుల ద్వారా తీర్చకుంటున్నది. రేర్ అయస్కాంతాలపై చైనా గుత్యాధిపత్యం, చైనా ఆంక్షలను అరికట్టడానికి ప్రధాని మోదీ నేతృత్వంలోని క్యాబినెట్  నిర్ణయం తీసుకుంది. విద్యుత్ వాహనాలు, ఎలక్ట్రానిక్స్, రక్షణ పరికరాల్లో కీలకమైన రేర్‌ఎర్త్ శాశ్వత అయస్కాంతా(ఆర్‌ఈపీఎం)ల తయారీని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం దీనిని ఆమోదించింది.

అరుదైన ఎర్త్ ఆక్సైడ్‌లను లోహాలుగా మార్చడం, లోహాలను మిశ్రమ లోహాలుగా రూపాంతరం చెందించడం, వీటి ని అయస్కాంతాలుగా ఉత్పత్తి చేయ డం వం టి ప్రక్రియలు ఈ పథకంలో ఉంటాయి.  ప్రస్తుతం భారత్ దాదాపుగా శాశ్వ త అయస్కాంతాలను దిగుమతి చేసుకుంటోంది. 2030 నాటికి వీటి డిమాండ్ రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా. 

దీంతో చైనాపై ఆధారపడకుండా దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం చర్యలు తీసు కుంటోంది. మొత్తం బడ్జెట్‌లో, ఐదేళ్లలో అమ్మకాలు ప్రోత్సాహకాలుగా రూ.6,450 కోట్లు ఇస్తారు. ఫెసిలిటీల ఏర్పాటుకు రూ.750 కోట్ల మూలధన సబ్సిడీగా అందిచనున్నారు. 

ఈ  అయస్కాంతాలు చాలా కీలకం

ఈవీ వాహనాల్లో వాడే మోటార్స్, విండ్ టర్బైన్స్, డ్రోన్లు, శాటిలైట్లు, వైద్య పరికరాల్లో ఈ  అయస్కాంతాలు చాలా కీలకం. దేశీయ దిగుమతులపై ఆధారపడటాన్ని  తగ్గించుకోవాలనే కేంద్రం ఆకాంక్షలను క్యాబినేట్ నిర్ణ యం సాకారం చేయనుంది.

ఉద్యోగాలను సృష్టించడం, పెట్టుబడుల్ని ఆకర్షించడం, ప్ర పంచ అరుదైన భూమి అయస్కాంత మార్కెట్‌లో భారత్‌ను ప్రధాన స్థానంలో నిలబె ట్టాలని కేంద్రం భావిస్తోంది. దేశీయ డిమా ం డ్ ఏటా దాదాపు 4,010 టన్నులుగా ఉంద ని, 2030 నాటికి  రెట్టింపు (8,22 0టన్నులు)నకు చేరుకుంటుందని అంచనా.