05-12-2025 01:56:34 AM
ముకరంపురా, డిసెంబరు 4 (విజయ క్రాంతి): కరీంనగర్ కార్పొరేషన్ లోని కాం గ్రెస్ నాయకులతో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్ కుమార్ గురువారం ప్రత్యే క సమావేశం నిర్వహించారు. నూతనంగా ని యమింపబడ్డ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి సత్యంకు ఘనంగా స్వాగతం పలకాలని, ఓట్ చోరి మీద ప్రతి బూతు నుంచి 100 సంతకాల సేకరణ చేయాలని అంజన్ కుమార్ కోరారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్, వివిధ విభాగాల నాయకులుపాల్గొన్నారు.