05-12-2025 01:56:33 AM
హైదరాబాద్, డిసెంబర్ 4 (విజయక్రాంతి) : సివిల్ సర్వీసెస్‌కు ఎంపికైన వారు సమాజంపై బాధ్యతగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నా రు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం పథకం కింద సివిల్ సర్వీసెస్ మెయిన్స్, ఇం టర్వ్యూలకు ఎంతమంది ఎంపికైనా ఆర్థిక సహాయం అందిస్తామని అన్నారు. గురువా రం సాయంత్రం ఆయన ప్రజాభవన్ లో యూపీఎస్సీ ఇంటర్వ్యూకు ఎంపికైన 50 మందికి చెక్కులు అందించిన అనంతరం ప్రసంగించారు.
సివిల్ సర్వీసులకు రాష్ర్టం నుంచి ఎంత మంది ఎక్కువ ఎంపికైతే.. రాష్ట్రానికి అంత మంచిదని భావించి ఆర్థికం గా ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. అపారమైన మేధస్సు ఉన్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులు గల పేదలకు సింగరేణి ఆధ్వర్యంలో రాజీవ్ గాం ధీ సివిల్స్ అభయహస్తం పథకాన్ని తీసుకొచ్చామని వివరించారు. మెయిన్స్‌కు ఎంపి కైన వారికి రూ.లక్ష, ఆ తర్వాత ఇంటర్వ్యూకు ఎంపికైన వారికి రూ.లక్ష చొప్పున ఆర్థికసాయంతో పాటు ఢిల్లీలో వసతి సౌకర్యం కల్పి స్తున్నట్టు భట్టి వివరించారు.
గత సంవత్సరం 20 మంది ఇంటర్వ్యూకు వెళ్లగా అందులో ఏడుగురు సివిల్ సర్వీసెస్‌కు ఎంపిక కావ డం అభినందనీయమన్నారు. ఈ సంవత్సరం సుమారు 202 మంది మెయిన్స్‌కు ఎంపిక కాగా అందులో 50 మంది ఇంటర్వ్యూకు ఎంపికయ్యారని తెలిపారు. వచ్చే సారి ఈ సంఖ్య 100కు దాటాలని ఆకాంక్షించారు. ఇంటర్వ్యూకు వెళ్లే 50 మంది విజయం సాధించాలన్నారు. ‘మీరు స్థిరపడిన తర్వాత మిమ్ములను పెంచి పోషించిన తల్లిదండ్రుల పట్ల ఎంత బాధ్యతగా ఉంటా రో సమాజం పట్ల కూడా అంతే బాధ్యతగా ఉండాలని డిప్యూటీ సీఎం కోరారు.
రాష్ర్ట ప్రభుత్వంలోని సీనియర్ బ్యూరోక్రాట్లతో ఇంటర్వ్యూ బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. సివిల్స్ ఇంట ర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలిపారు. సింగరేణి సంస్థ సీఎండీ ఎన్.బలరామ్ మాట్లాడుతూ పేదవర్గాల అభ్యర్థులు కూడా సివిల్స్ పరీక్షల్లో విజేతలుగా నిలవాలనే లక్ష్యంతో రాష్ర్ట ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.