calender_icon.png 1 July, 2025 | 10:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పులిమామిడి గ్రామంలో సివిల్ రైట్స్ డే

01-07-2025 12:59:35 AM

చేగుంట, జూన్ 30 : చేగుంట మండల పరిధిలోని  పులిమామిడి గ్రామంలో సోమవారం చేగుంట ఎస్త్స్ర-2 బిక్య నాయక్, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో సివిల్ రైట్స్ డే ( పౌర హక్కుల దినోత్సవం ) కార్యక్రమన్ని నిర్వహించారు, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఎస్సీ, ఎస్టి, బీసీ, ఇతర కులాల మధ్య తేడాలు, విబేధాలు రాకూడదన్నారు.

చాయి హోటళ్లలో ఓకే గ్లాస్ విధానం ఉండాలని, గ్రామంలో ఉన్న అన్ని దేవాలయాలో దైవదర్శనానికి వచ్చే ఎస్సీ, ఎస్టీకి చెందిన కులస్తులను అడ్డుకోకూడదన్నారు. ఎవరైనా కులం పేరుతో దూషించినా, దేవుని గుడిలోనికి రాకుండా అడ్డుపడినా వారి పైన ఎస్సీ, ఎస్టీ అట్రాస్టీట్ కేసు నమోదు చేసి జైలుకు పంపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ 2 బిక్య నాయక్, ఆర్‌ఐ సంతోష్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఎస్సీ హాస్టల్ వార్డెన్ రమేష్, గ్రామ పంచాయతీ సెక్రెటరీ, గ్రామస్తులు పాల్గొన్నారు.