calender_icon.png 1 July, 2025 | 9:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదవీ విరమణ పొందిన ఎస్‌ఈకి సన్మానం

01-07-2025 12:59:03 AM

మహబూబాబాద్, జూన్ 30( విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా నీటిపారుదల శాఖలో సూపరిoటెండెంట్ ఇంజనీర్ గా పనిచేసిన స్వర్గం నరసింహారావు సోమవారం పదవీ విరమణ పొందారు. ఈ సందర్భంగా నరసింహరావు దంపతులను సోమవారం ఆ శాఖ ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ఆ శాఖ కు ఆయన చేసిన సేవలను కొనియాడారు.

వివాదరహితుడుగా ఉద్యోగులతో ఆత్మీయంగా పనిచేయించుకోవడంలో ఆయనకు ఆయనే సాటి అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు , అసిస్టెంట్ ఇంజనీర్లు,పలువురు సిబ్బంది పాల్గొన్నారు.

పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన వీడ్కోలు 

ములుగు జూన్30(విజయక్రాంతి): పోలీస్ డిపార్ట్మెంట్లో తమ సర్వీస్ పూర్తి చేసుకుని ఈరోజు పదవీ విరమణ చేసిన ఏ ఆర్ హెడ్ క్వార్టర్స్ నందు విధులు నిర్వహిస్తున్న ఆర్‌ఎస్‌ఐ ఎం.రవీందర్,ఎన్.కనకయ్య, ఏఆర్‌ఎస్‌ఐ కె.సుబ్బరాయుడు,  సీసీఎస్ నందు విధులు నిర్వహిస్తున్న ఏఎస్‌ఐ ఏ.రామకిష్టయ్య,పిసిఆర్ నందు విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్  సిహెచ్ చుక్కయ్యకు జిల్లా కేంద్రంలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో ములుగు జిల్లా ఎస్పీ శాలువా కప్పి, జ్ఞాపికను బహూకరించి  పదవి విరమణ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సంద ర్భంగా జిల్లా ఎస్పీ డా.శబరిష్.పి ఐపీఎస్ మాట్లాడుతూ ఏఆర్హెడ్ క్వార్టర్స్ నందు విధులు నిర్వహిస్తున్న ఆర్‌ఎస్‌ఐ ఎం.రవీందర్, ఎన్.కనకయ్య, ఏఆర్‌ఎస్‌ఐ కె.సుబ్బరాయుడు,  సీసీఎస్ నందు విధులు నిర్వహిస్తున్న ఏఎస్‌ఐ ఏ.రామకిష్టయ్య, పిసిఆర్ నందు విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్  సిహెచ్ చుక్కయ్యలు  పోలీస్ డిపార్ట్మెంట్లో సుదీర్ఘంగా సేవలందించి సర్వీస్ పూర్తి చేసుకుని ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలను పొందినారని శుభాకాంక్ష లు తెలియజేశారు.

పోలీస్ విభాగంలో సుధీర్ఘ కాలంగా విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన సిబ్బంది సేవను మరువమని, పదవీవిరమణ చేసిన మీరు పోలీస్ కుటుంబంలో ఎలాంటి సమస్య వచ్చిన తనను సంప్రదించ వచ్చని అన్నారు పోలీసు రిటైర్ మెంట్ కేవలం వారి వృత్తికే, కాని వారి వ్యక్తిత్వానికి కాదని కొనియాడారు.

విధి నిర్వహణలో పగలనక, రాత్రనక, పండగల సమయంలో భార్యా,పిల్లలకు దూరంగా ఉండి విధులు నిర్వహించినారు.   ఈ కార్యక్రమంలో ములుగు డి.ఎస్.పి రవీందర్,ఎస్ బి ఇన్స్పెక్టర్ శంకర్,ఆర్‌ఐ లు స్వామి, సంతోష్,తిరుపతి, పదవి విరమణ పొందిన వారి కుటుంబ సభ్యులు, తోటి సిబ్బంది పాల్గొన్నారు.