calender_icon.png 9 October, 2025 | 9:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యవసాయ మార్కెట్ ను పరిశీలించిన సివిల్ సప్లై కమిషనర్ డీఎస్ చౌహాన్

09-10-2025 04:54:10 PM

వలిగొండ (విజయక్రాంతి): వలిగొండ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ను గురువారం సివిల్ సప్లై కమిషనర్ డీఎస్ చౌహన్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసిన ధాన్యాన్ని, ప్యాడి ఫ్యాన్లతో తాలు లేకుండా  పడుతున్న తీరును, మట్టి, తాలు వేరు చేసే మిషన్లను పరిశీలించారు. అదేవిధంగా రైతులకు ధాన్యం నింపేందుకు సరిపోయే బస్తాలు ఉన్నాయా లేదా అని గన్ని బ్యాగుల గోడౌన్ ను పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధాన్యం కొనుగోలులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అన్నారు. బీహార్ ఎన్నికల దృష్ట్యా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పని చేసే బీహార్ హమాలీలు తిరిగి వారి రాష్ట్రానికి వెళ్తుండడంతో హమాలీల కొరత ఏర్పడవచ్చు అని అందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లై డిఎం హరికృష్ణ, డిఎస్ఓ రోజారాణి, డిటి బాలమణి, కార్యదర్శి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.