09-10-2025 08:42:56 PM
డాక్టర్ఏ. అప్పయ్య..
జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి..
హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): కేంద్ర, రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ సూచనలకు అనుగుణంగా ఈ నెల 12 ఆదివారం రోజు అప్పుడే పుట్టిన పాప నుంచి 5 ఏళ్లలోపు చిన్నారులకు తల్లిదండ్రుల బాధ్యత తీసుకొని పల్స్ పోలియో చుక్కలను తప్పనిసరిగా వేయించి, పోలియో నిర్మూలనకు సహకరించాలని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఏ. అప్పయ్య తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో గత 14 సంవత్సరంల నుండి పోలియో కేసు నమోదు కానప్పటికీ రాష్ట్రంలోని పట్టణ జనాభా అధికంగా ఉన్న హనుమకొండ జిల్లాతో పాటు మొత్తం ఐదు జిల్లాలలో ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, ఈ 12న జిల్లాలో 0 నుండి 5 సంవత్సరాల వయసు గల(84301) పిల్లలకు పోలియో చుక్కలు వేసేందుకు (472) బూతులు (17) బస్టాండ్లు, రైల్వే స్టేషన్ లాంటి ట్రాన్సిట్ పాయింట్లు, మొబైల్ బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లా ఇమునైజేషన్ అధికారి డాక్టర్ ఏ. మహేందర్ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారని, జిల్లాకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ తయారు చేశారని అన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలియో చుక్కలు వేయడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా గురువారం జూమ్ ద్వారా వైద్యాధికారులు, సూపర్వైజర్స్ తో డీఎంహెచో, డీఐఓ సమావేశం నిర్వహించారు.